SIM Cards: కేంద్రం కొత్త రూల్స్.. సిమ్ కార్డు తీసుకోవాలంటే అది తప్పనిసరి..

Updated on: Aug 23, 2026 | 6:09 PM

కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డు రూల్స్‌లో అనేక మార్పులు తీసుకొచ్చింది. సిమ్‌ల దుర్వినియోగం అరికట్టేందుకు కఠిన ఆంక్షలు విధించింది. ఇక నుంచి మీరు కొత్త సిమ్ తీసుకోవాలన్నా లేదా రీప్లేస్‌మెంట్ చేసుకోవాలన్నా ఈ రూల్స్ వర్తించనున్నాయి. కొత్త మార్పులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

1 / 5
కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు చేసింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మీరు కొత్త సిమ్ కార్డు తీసుకోవాలని అనుకుంటుంటే.. ఈ కొత్త నియమాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. ఇప్పటినుంచి సిమ్ కార్డు తీసుకోవాలంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఈ మేరకు కొత్త టెలికమ్యూనికేషన్ రూల్స్ 2026ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తీసుకొచ్చింది.

2 / 5
ఇక నుంచి కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా లేదా ఇతర టెలికాం సర్వీసులు పొందాలన్నా ఖచ్చితంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. యూజర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కొత్త సిమ్ కనెక్షన్ తీసుకునేటప్పుడు ఆధార్ ఈకేవైసీ పూర్తి చేయాలని, లేకపోతే డీకేవైసీ అయినా ప్రాసెస్ చేయాలని నిబంధనల్లో పేర్కొంది. ఈ నిబంధనలు ప్రతీ టెలికాం ఆపరేటర్ పాటించాలని కోరింది.

3 / 5
ఇక కొత్త సిమ్ కార్డు తీసుకునే సమయంలోనే కాకుండా సిమ్ రిప్లేస్‌మెంట్, పేరు, జెండర్,  డేట్ ఆఫ్ బర్త్ వంటి వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవాలన్నా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఇక రీవెరిఫికేషన్ సమయంలో కూడా బయోమెట్రిక్ అధెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్ ఈకేవైసీ పూర్తి చేయలేనివారు డీకేవైసీ ప్రాసెస్ చేయాలని ఆదేశించింది.

4 / 5
ఇక వ్యాపార ప్రయోజనాల కోసం సిమ్‌ కనెక్షన్స్ తీసుకునేవారికి కూడా యూజర్ ఐడెంటిఫికేషన్ నియమాలు వర్తిస్తాయి. కొత్త కనెక్షన్ తీసుకునేవారితో పాటు దానిని వినియోగించేవారి ఐడెంటిఫికేషన్ కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. ఎవరైతే నకిలీ పత్రాలను సమర్పించి తీసుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. సిమ్ కనెక్షన్ డిస్ కనెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

5 / 5
కొంతమంది మోసాలకు పాల్పడేవారు తప్పుడు సిమ్ కార్డులను తీసుకుంటున్నారు. అలాగే ఇతరుల పేరుతో మొబైల్ కనెక్షన్లు తీసుకుని వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో టెలికాం నెట్ వర్క్ సెక్యూరిటీ పెంచడం కోసం ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us