Aadhaar Card: ఆధార్ కార్డులకు కొత్త రూల్స్.. 2026 నుంచి మారిన నిబంధనలు.. అందరూ తెలుసుకోవాల్సిందే

Updated on: Jan 02, 2026 | 5:10 PM

దేశంలోనే నివసించే వారందరికీ ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యం. ఈ కార్డు లేనిది దేశంలో మీరు ఏ పని కూడా చేయలేరు. ఆధార్ కార్డుల్లో యూఐడీఏఐ ఎప్పటికప్పుడు మార్పులు అమల్లోకి తెచ్చింది. వాటి గురించి మనం ముందే తెలుసుకోవడం ద్వారా జాగ్రత్తపడవచ్చు.

1 / 5
దేశంలో నివసించే ప్రతీ వ్యక్తికి ఆధార్ కార్డు అనేది ఎంత ముఖ్యమనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనం దేశంలో ఏ సేవలు పొందాలన్నా ఈ గుర్తింపు ధృవీకరణ పత్రం లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ పథకాలు పొందటం దగ్గర నుంచి బ్యాంకు అకౌంట్ వరకు ప్రతీ పనికి ఆధార్ అనేది తప్పనిసరి. ప్రజలందరికీ అవసరమైన ఆధార్ కార్డు విషయంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఎప్పటికప్పుడు మార్పులు తెస్తూ ఉంటుంది.

2 / 5
ప్రజలు సులభతరంగా ఆధార్ సర్వీసులు ఉపయోగించుకోవడం పాటు దుర్వినియోగం కాకుండా పారదర్శకత కోసం కాలానుగుణంగా యూఐడీఏఐ కొత్త రూల్స్ ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా 2026 నుంచి ఆధార్ కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. అవేంటో ఓ లుక్కేయండి.

3 / 5
2026 నుంచి మీ ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, ఫొటోగ్రాఫ్ మార్చుకోవాలంటే తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి కఠిన నిబంధనలు లేవు. దీంతో ఎవరైనా సులువుగా మార్చుకునేవారు. కానీ ఆధార్లు దుర్వినియోగం జరగకుండా చూసేందుకు ఈ ఏడాది నుంచి యూఐడీఏఐ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

4 / 5
డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే జనన ధృవీకరణ పత్రం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక అడ్రస్ మార్చుకోవాలంటే కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ వంటివి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది.

5 / 5
ఇక పేరు లాంటివి మార్చుకోవడానికి పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, పెన్షన్ కార్డ్, ప్రభుత్వ ఆరోగ్య పథం కార్డు, పాస్ పోర్ట్, ఈ పాన్, NRGA ఉపాధి కార్డు, లింగ మార్పిడి గుర్తింపు కార్డ్ లేదా ప్రభుత్వాలు జారీ చేసే మీ ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.