LPG Cylinder Price: ఏప్రిల్‌ 1 నుంచి ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు పెరుగుతాయా..?

Updated on: Mar 29, 2026 | 1:24 PM

LPG Cylinder Price: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు, గ్యాస్ ధరలు అధికంగానే ఉన్నాయి. తత్ఫలితంగా, ఏప్రిల్ 1వ..

1 / 6
 LPG Cylinder Price: ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తారన్న వదంతులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసంది. అలాంటిదేమి లేదని స్పష్టం చేసింది. అలాగే సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్ద కూడా పేర్కొంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై వస్తున్న ఊహాగానాలు పూర్తిగా నిరాధారమైనవని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. ప్రభుత్వం అటువంటి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన నొక్కి చెప్పారు.

2 / 6
 ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఉన్నప్పటికీ దేశంలో ఇంధనానికి లేదా నిత్యావసర వస్తువులకు కొరత లేదని ప్రభుత్వం కూడా పేర్కొంది. మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో తగినంత చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయి. రాబోయే 60 రోజులకు సరిపడా సరఫరాలు ఇప్పటికే సురక్షితంగా ఉంచింది ప్రభుత్వం. అంతేకాకుండా, భారతదేశం ఇప్పుడు 41కి పైగా దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇది హోర్ముజ్ జలసంధిలో ఏదైనా దిగ్బంధనం ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అయితే, ప్రభుత్వం నుండి ఈ హామీ ఉన్నప్పటికీ, భయాందోళనలతో కొనుగోళ్లు జరగడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద పొడవైన క్యూలు ఏర్పడ్డాయి.

3 / 6
 ఇదిలా ఉండగా, చమురు కంపెనీలు కూడా తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూసేందుకు పెట్రోల్ పంపు యజమానులు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ రుణాలు పొందుతున్నారు. భారతదేశం పెట్రోలియం ఉత్పత్తులను కూడా ఎగుమతి చేస్తోందని, అందువల్ల ఈ సమయంలో "జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి" అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన గ్యాస్‌ ధలు మారుతుంటాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరుగుతాయా, లేక కొంత ఉపశమనం ఉంటుందా?

4 / 6
 ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా, ఉపశమనం లభించే ఆశలు తక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ముడి చమురు, గ్యాస్ ధరలు అధికంగానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇంధన ధరలు ఇప్పటికే పెరిగాయి. అందుకే ఏప్రిల్ 1, 2026న ఎల్‌పిజి వినియోగదారులు ఎదురుదెబ్బ తింటే ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి గానీ, ఆయిల్ కంపెనీల నుంచి ఎటువంటి ప్రకటన లేదు. ఎప్పుడు కూడా ధర 1వ తేదీనే నిర్ణయిస్తారు. ముందుగా ఎటువంటి ప్రకటన రాదు. ఇప్పటి వరకు జరిగింది కూడా ఇదే. మొదటి తేదీనే ధరలు పెరగడం, తగ్గడం జరుగుతుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ధరలు పెరుగుతాయని పుకార్లు సృష్టిస్తున్నారు.

5 / 6
 ధరల మార్పుల అవకాశం: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు, గ్యాస్ ధరలు అధికంగానే ఉన్నాయి. తత్ఫలితంగా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ధరల పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు.

6 / 6
 2026 మార్చిలో గృహ వినియోగ సిలిండర్ల ధరలు రూ.60 పెరిగాయి. ప్రస్తుతం వాటి ధర సుమారు రూ.965, ఉండగా, అదే సమయంలో మార్చిలో వాణిజ్య సిలిండర్ల ధరలు రూ.2105 ఉంది. అయితే ఈ ధరల్లో ప్రాంతాలను బట్టి తేడా ఉండవచ్చని గుర్తించకోండి. వచ్చే నెలలో ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనేది అంతర్జాతీయ ఇంధన మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎల్‌పిజితో పాటు, సిఎన్‌జి మరియు పిఎన్‌జి ధరలు కూడా మారే అవకాశం ఉంది.

Follow Us