
డబ్బులు పొదుపు చేసుకుని దీర్ఘకాలంలో ఎక్కువ ఆదాయం పొందేందుకు, ప్రమాదవశాత్తూ అకాల మరణం చెందితే కుటుంబానికి ఆర్ధిక భద్రత కల్పించేందుకు చాలామంది ఎల్‌ఐసీ పాలసీలు తీసుకుంటూ ఉంటారు. ఎల్ఐసీలో అనేక పాలసీలు ఉండగా.. జీవన్ ఆనంద్ లాంటి కొన్ని పాలసీలు బాగా పాపులర్ అయ్యాయి. దేశంలో కోట్లాదిమంది లైఫ్ ఇన్యూరెన్స్ కొర్పొరేషన్‌లో పాలసీలు తీసుకుని ఉన్నారు.

అయితే ఎల్‌ఐసీ పాలసీలు తీసుకున్నవారికి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు కట్టే ప్రీమియంపై రుణ సుదుపాయం కల్పిస్తారు. పాలసీ తీసుకుని వరుసగా మూడేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే ఆ తర్వాత రుణ సదుపాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణం మీ ఆర్ధిక అవసరాలను తీర్చుకోవడంలో సహయపడుతుంది. పాలసీ యాక్టివ్‌గా ఉన్నవారికి ఈ లోన్ అందిస్తారు.

పాలసీ సరెండర్ వాల్యూ 90 శాతం మొత్తాన్ని లోన్ రూపంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. పర్సనల్, గోల్డ్, ఇతర లోన్స్‌తో పోలిస్తే ఈ లోన్ వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ లోన్ చెల్లించనంత మాత్రాన వడ్డీ పెరగడం, పాలసీ బెనిఫిట్స్ తగ్గించడం, మెచ్యూరిటీ అమౌంట్‌పై ప్రభావితం చూపించడం లాంటివి ఏమీ ఉండవు. అయితే లోన్ కట్టకపోవడం వల్ల వడ్డీ అనేది పెరుగుతూ ఉంటుంది.

పాలసీ మెచ్యూరిటీ నాటికి మీరు రుణం కట్టకపోతే మీకు వచ్చే మొత్తం డబ్బుల్లో వీటిని కట్ చేసి మిగతావి అందిస్తారు. అంతేకాకుండా డెట్ క్లెయిమ్ బెనిఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మీరు తీసుకున్న లోన్ పాలసీ అమౌంట్ వాల్యూను మించిపోతే పాలసీ స్టేటస్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మీరు పాలసీని ఒకవేళ మధ్యలో సరెండర్ చేయాల్సి వస్తే విలువ తగ్గుతుంది.

పాలసీపై తీసుకునే రుణానికి వార్షిక వడ్డీ రేటు 6 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటుంది. టర్మ్ ఇన్యూరెన్స్ ప్లాన్స్, ఎండోమెంట్ ప్లాన్,. మనీ బ్యాక్ పాలసీలు, పెన్షన్ స్కీమ్స్ పాలసీలు తీసుకునేవారికి రుణ సదుపాయం ఉంటుంది. ఇక యూనిట్ లింక్డ్ ఇన్యూన్స్ ప్లాన్స్ తీసుకునేవారికి కూడా లోన్ సౌకర్యం అనేది ఉంటుంది.