LIC: ఒక్కసారి డబ్బులు కడితే జీవితాంతం డబ్బులే డబ్బులు.. ఎల్‌ఐసీలో ఈ అద్బుత స్కీమ్ చాలామందికి తెలియదు..

Updated on: Oct 03, 2026 | 5:42 PM

ఎల్‌ఐసీలో అనేక అద్బుత పథకాలు ఉన్నాయి. ఒకసారి పెట్టుబడి పెడితే జీవితాంతం పెన్షన్ పొందే పాలసీలు ఉన్నాయి. ఎంత పెన్షన్ కావాలనేది మీరే నిర్ణయించుకోవచ్చు. దీని వల్ల మీరు స్థిరమైన ఆదాయం పొందవచ్చు. పాలసీదారుడు మరణించాక జీవిత భాగస్వామి కూడా పెన్షన్ పొందవచ్చు.

1 / 5
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)లో అనేక పాలసీలు అందుబాటులో ఉంటాయి. మీ ఆదాయం, ఆర్ధిక అవసరాలు, కుటుంబ భద్రతను బట్టి పాలసీలను ఎంచుకోవచ్చు. అలాగే అనేక మెచ్యూరిటీ పీరియడ్‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి. మీ అవసరం మేరకు ఏదైనా సెలక్ట్ చేసుకోవచ్చు. నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ప్రీమియం ఆప్షన్లు ఉంటాయి. దీంతో మీ ఆదాయాన్ని  బట్టి ప్రీమియం ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు.

2 / 5
పదవీ విరమణ తర్వాత ప్రతీ నెలా పెన్షన్ రూపంలో ఆదాయం కావాలనుకునేవారికి ఎల్‌ఐసీలో ఒక బెస్ట్ స్కీమ్ ఉంది. అదే జీవన్ అక్షయ్--VII' పథకం. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందవచ్చు. ఇది యాన్యుటీ ప్లాన్ కాగా.. పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి ఆదాయం మొదలవుతుంది. అలాగే ఎంత ఆదాయం వస్తుందనేది ముందుగా ఫిక్స్ అవుతుంది.

3 / 5
ఉదాహరణకు మీ వయస్సు 60 సంవత్సరాలుగా ఉండి ఒకేసారి రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే ఆప్షన్ ఏలో నెలకు రూ.7,175 పెన్షన్ అందుతుంది. ఆప్షన్ ఎఫ్‌లో నెలకు రూ.5333 పెన్షన్ వస్తుంది. ఆప్షన్ జీలో 5725, ఆఫ్షన్ బీలో రూ.7125, ఆప్షన్ సీలో రూ.7 వేలు, ఆఫ్షన్ డీలో రూ.6817 పెన్షన్  ప్రతీ నెలా అందుతుంది.

4 / 5
ఈ పెన్షన్ అమౌంట్‌పై ఎలాంటి పన్ను ఉండదు. ఒకవేళ పాలసీదారుడు మరణించాక జీవిత భాగస్వామి పెన్షన్ పొందాలనుకుంటే జాయింట్ లైఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ హెచ్, ఆప్షన్ ఐ ద్వారా జీవిత భాగస్వామి పెన్షన్ పొందవచ్చు. ఆప్షన్ జె ద్వారా జీవిత భాగస్వామి ఒకేసారి పెట్టుబడి మొత్తాన్ని ఉపసంహరించుకోచ్చు.

5 / 5
పాలసీదారుడు ఎంచుకున్న ఆప్షన్ల  ఆధారంగా ప్రతీ నెలా స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఈ పాలసీలో ఉంది. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపులు కూడా ఇందులో పొందవచ్చు. ఒకసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ఆదాయం పొందాలనుకునేవారికి ఇది మంచి పథకంగా చెప్పవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us