iPhone 18 Pro Max Repair: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ రిపేర్ ఖర్చు ఎంతో తెలుసా? స్క్రీన్ పగిలితే, బ్యాటరీ ఖర్చు ఎంత?

Updated on: Oct 22, 2026 | 1:00 PM

iPhone 18 Pro Max Repair: ఆపిల్ అధికారిక సర్వీస్ సెంటర్ ద్వారా మీ ఫోన్‌కు సర్వీస్ చేయించుకోవడం కొంచెం ఖరీదైనప్పటికీ, అక్కడ అసలైన విడి భాగాలు లభిస్తాయి. ఇది మరింత నమ్మదగినది. వినియోగదారులు 'జీనియస్ బార్' లేదా ఆపిల్ అధీకృత..

1 / 6
 iPhone 18 Pro Max Repair Cost: ఐఫోన్ ప్రో సిరీస్ మోడల్స్ అనేవి స్మార్ట్‌ఫోన్ ప్రియులు సొంతం చేసుకోవాలని ఆశించే ఒక కలల మోడల్. ఐఫోన్ శ్రేణిలో ప్రో మాక్స్ మోడల్స్ అత్యంత శక్తివంతమైనవి. కొత్త ఐఫోన్ 18 ప్రో మోడల్స్ ఇప్పటికే విడుదలయ్యాయి అలాగే అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్‌ను కొనడం అత్యంత ఖరీదైన విషయం. దాని మరమ్మత్తు కూడా ఖరీదైనదే.

2 / 6
 భారతదేశంలో ఐఫోన్ 18 ప్రో మాక్స్ వేరియంట్ల ధరలు ఇప్పటికే అందరికీ తెలిసిందే. 256GB వేరియంట్ ధర రూ. 1,79,900, 512GB వేరియంట్ ధర రూ. 2,04,900, 1TB వేరియంట్ ధర రూ. 2,54,900, 2TB వేరియంట్ ధర రూ. 3,29,900గా ఉన్నాయి. అయితే, చాలా మందికి ఈ ధర తెలిసినప్పటికీ, దాని మరమ్మత్తు ఖర్చు గురించి కొద్దిమందికే తెలుసు. చాలా మందికి ఈ ధరలు తెలియవు. అందుకే నిపుణులు, ఇతర వెబ్‌ సైట్ల వివరాల ప్రకారం ఈ ఖర్చు వివరాలను అందిస్తున్నాము.

3 / 6
 మొబైల్‌ ధర ఎక్కువగా ఉన్నట్లే ఐఫోన్ 18 ప్రో మాక్స్ రిపేరు ఖర్చు కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఏదైనా రిపేరు వస్తే దీనికి సంబంధించి ఆరు విభాగాలు ఉన్నాయి. ఆపిల్ రిపేరులోని ఈ ఆరు విభాగాలు: బ్యాటరీ,  వెనుక గ్లాస్ లోపాలు, వెనుక కెమెరా సమస్యలు,  స్క్రీన్ డ్యామెజ్‌, స్క్రీన్‌ , వెనుక ప్యానెల్ గ్లాస్‌కు నష్టం. అలాగే ఇతర నష్టాలు. వీటికి సంబంధించిన ఏదైనా రిపేరు ఉన్నట్లయితే ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూద్దాం..

4 / 6
భారతదేశంలో ఐఫోన్ 18 ప్రో మాక్స్ రిపేరు ఖర్చు: బ్యాటరీ సర్వీస్‌కు రూ. 13,900, దెబ్బతిన్న వెనుక ప్యానెల్ గ్లాస్ మార్పిడికి రూ.16,900, వెనుక కెమెరా రిపేరుకు రూ. 28,900.

5 / 6
 ఐఫోన్ 18 ప్రో మాక్స్ స్క్రీన్ దెబ్బతింటే దాన్ని బాగు చేయడానికి రూ. 42,900 ఖర్చవుతుంది. స్క్రీన్, వెనుక గ్లాస్ రెండూ దెబ్బతింటే రెండింటికీ కలిపి రూ. 51,900 ఖర్చవుతుంది. ఈ జాబితాలో పేర్కొనని నష్టం జరిగినట్లయితగే అయ్యే ఖర్చు రూ. 1,17,900 అవుతుంది.

6 / 6
 ఆపిల్ అధికారిక సర్వీస్ సెంటర్ ద్వారా మీ ఫోన్‌కు సర్వీస్ చేయించుకోవడం కొంచెం ఖరీదైనప్పటికీ, అక్కడ అసలైన విడి భాగాలు లభిస్తాయి. ఇది మరింత నమ్మదగినది. వినియోగదారులు 'జీనియస్ బార్' లేదా ఆపిల్ అధీకృత సర్వీస్ సెంటర్ల ద్వారా సహాయం పొందవచ్చు. అయితే ఆపిల్ స్టోర్లలో (Apple Stores) ఆపిల్ ఉత్పత్తులకు సంబంధించిన సాంకేతిక సహాయం, హార్డ్‌వేర్ మరమ్మతులను అందించే ప్రదేశాన్ని జీనియస్ బార్ (Genius Bar) అంటారు. మీ చేతిలో ఉన్న ఐఫోన్ 'Apple Care+' కవరేజీ పరిధిలోకి వస్తే, సర్వీస్ ఖర్చు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us