Indian Railways: రైలు వెనుక ఈ గుర్తు లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా..? ఇందులో ఇంత అర్థం ఉందా?

Updated on: Jun 10, 2026 | 10:00 AM

Indian Railways: చాలా మందికి రైలులోని కొన్ని విషయాల అర్థం తెలియదు. అటువంటి సందర్భంలో రైలు బోగీ వెనుక భాగంలో పెద్ద అక్షరాలతో రాసి ఉన్న 'X' గుర్తును మనం చూసే ఉంటాము. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం. అలాగే ఈ..

1 / 5
 Indian Railways: భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తారు. రైలు ప్రయాణం సురక్షితమైనది.. సౌకర్యవంతమైనది. అయితే మనలో చాలా మందికి రైలులోని కొన్ని విషయాల అర్థం తెలియదు. అటువంటి సందర్భంలో రైలు బోగీ వెనుక భాగంలో పెద్ద అక్షరాలతో రాసి ఉన్న 'X' గుర్తును మనం చూసే ఉంటాము. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం. అలాగే ఈ గుర్తు లేకపోతే ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలుసుకుందాం..

2 / 5
 రైలు వెళ్తున్నప్పుడు దాని చివరి బోగీపై పెద్ద 'X' గుర్తు రాసి ఉండటం మీరు చూసే ఉంటారు. స్టేషన్ దాటుతున్నప్పుడు రైల్వే అధికారులు రైలు చివరి బోగీపై ఈ 'X' గుర్తు ఉందో లేదో తనిఖీ చేస్తారు. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలుసా?

3 / 5
 'X' గుర్తుకు అర్థం ఏమిటి? భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. అన్ని  రైళ్లకు చివరి కోచ్‌పై 'X' గుర్తు ఉండటం తప్పనిసరి. ప్రయాణికుల సౌకర్యార్థం, రైళ్ల చివరి కోచ్‌పై ఈ పెద్ద 'X' గుర్తును రాస్తారు. ఇది ఆ రైలు చివరి కోచ్ అని సూచిస్తుంది. ఈ కోచ్‌ లేకపోతే రైలు బోగీ తప్పిపోయినట్లుగా భావిస్తారు. లేదా ఏదైనా ప్రమాదం జరిగినట్లుగా భావిస్తారు.

4 / 5
 LV అంటే ఏమిటి? రైలు బోగీపై X అనే మరో చిహ్నం ఉంటుంది. దానిపై LV అని రాసి ఉంటుంది. LV పూర్తి రూపం 'లాస్ట్ వెహికల్'. ఇది ఒక రైల్వే కోడ్. అలాగే, భద్రతా కారణాల దృష్ట్యా దీనిని రైలు చివరి బోగీపై రాస్తారు. ఇది రైలు చివరి బోగీ అని రైల్వే సిబ్బందికి సూచిస్తుంది.

5 / 5
 ఎర్ర లైట్ ఎందుకు వెలుగుతుంది? అదనంగా రైల్వే క్రాసింగ్ వద్ద ఆకుపచ్చ జెండాను చూపించే విధిలో ఉన్న ఉద్యోగి 'X' గుర్తును చూసి రైలులోని అన్ని కోచ్‌లు కలిసి ఉన్నాయని నిర్ధారించుకుంటారు. రాత్రి చీకటిలో ఆ గుర్తు స్పష్టంగా కనిపించనప్పుడు రైలు చివరి కోచ్‌ను గుర్తించడానికి దాని కింద ఎర్ర లైట్ వెలుగుతూ ఉంటుంది.

Follow Us