Gold IT Rules: పురుషులు, మహిళలు.. ఎవరి దగ్గర ఎంత బంగారం ఉంచుకోవచ్చు.. కొత్త ఐటీ రూల్స్ ఇవే..

Updated on: Mar 03, 2026 | 12:47 PM

మీ ఇంట్లో బంగారం ఎంతవరకు ఉంచుకోవచ్చు. మహిళల దగ్గర ఎంత ఉండొచ్చు. పురుషుల వద్ద ఎంతవరకు ఉండొచ్చు. పెళ్లి కాని మహిళల వద్ద ఎంత ఉంచుకోవచ్చు. పెళ్లైన మహిళ వద్ద ఎంతవరకు దాచుకోవచ్చు.. ఇలా ఐటీ శాఖ రూల్స్, నిబంధనలు చాలా ఉన్నాయి.

1 / 5
ఇండియాలో బంగారాన్ని ఒక అలంకార వస్తువుగానే కాకుండా ఆస్తిగా పరిగణిస్తారు. భారతీయులకు బంగారం అంటేనే ఓ సెంటిమెంట్. ఇక మహిళలకైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ప్రతిఒక్కరూ తమ ఇంట్లో బంగారాన్ని భద్రపర్చుకుంటూ ఉంటారు. కొంతమంది దగ్గర ఎక్కువగా ఉంటే.. మరికొంతమంది వద్ద తక్కువగా ఉంటుంది.

2 / 5
అయితే ఇంట్లో ఎంతవరకు బంగారం ఉంచుకోవచ్చు.. ఒక వ్యక్తి ఎంత బంగారం తన వద్ద దాచుకోవచ్చు అనే దానిపై చాలామందికి అనుమానాలు ఉంటాయి. అయితే బంగారం ఎంతైనా కలిగి ఉండొచ్చు. కానీ ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం.. కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులకు మించి బంగారం దాచుకున్నప్పుడు ఐటీ రైడ్స్ సమయంలో సరైన  ఆధారాలు చూపించాలి.

3 / 5
1994 కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకారం పెళ్లైన మహిళలు 50 తులాల వరకు బంగారం తమ వద్ద ఉంచుకోవచ్చు. ఇక పెళ్లి కాని మహిళ 250 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. పురుషుల వద్ద 100 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. ఇంట్లో పేరెంట్స్, పెళ్లి కాని కుమార్తె ఉంటే 850 గ్రాముల వరకు భద్రపర్చుకోవచ్చు.  ఈ పరిమితి వరకు ఉన్న బంగారాన్ని సీజ్ చేసే అధికారం ఐటీ శాఖకు లేదు.

4 / 5
ఇక వారసత్వంగా వచ్చే బంగారంపై ఎలాంటి పరిమితులు ఉండవు. కానీ ఐటీ దాడుల సమయంలో వీటికి తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఈ పరిమితులకు మించి మీ ఇంట్లో బంగారం ఉంటే తగిన ఆధారాలు లేదా బిల్లులు చూపించాల్సి ఉంటుంది. ఇక కుటుంబసభ్యులకు సంబంధం లేని వ్యక్తి బంగారం మీ ఇంట్లో ఉంటే ఐటీ శాఖ సీజ్ చేయవచ్చు.

5 / 5
ఐటీ శాఖ రూల్స్ కేవలం బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక డిజిటల్ గోల్డ్ బార్స్, కాయిన్స్, బిస్కెట్ల వంటి వాటికి నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. అవి కూడా మీ ఆదాయానికి మించి ఉంటే ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. లేకపోతే ఐటీ శాఖ చర్యలు తీసుకుంటుంది.

Follow Us