
Gold, Silver Prices: బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా ఆగస్ట్ 24న మరోసారి పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

గుడ్‌రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకకంగా 880 రూపాయలు పెరుగగా, 22 క్యారెట్ల 10 గ్రాములపై 800 రూపాయల వరకు ఎగబాకింది. అదే 18 క్యారెట్ల 10 గ్రాములపై 610 రూపాయల వరకు పెరిగింది.

ధరలు పెరిగిన తర్వాత హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,970 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,300 వద్ద ట్రేడవుతోంది. అదే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,930 రూపాయల వద్ద కొనసాగుతోంది.

జనవరిలో బంగారం ధరలు పెరిగి, గ్రాముకు రూ. 16,000 పైగా అమ్ముడైనప్పటికీ, మార్చి నుండి జూలై వరకు బంగారం ధరలు మందకొడిగా ఉన్నాయి. ముఖ్యంగా జూన్‌లో నిరంతర క్షీణత తర్వాత, బంగారం గ్రాముకు రూ. 13,000కు అమ్ముడైంది. ఈ పరిస్థితిలో జూలైలో స్వల్ప ధర పెరుగుదలను చూసిన బంగారం.. ఆగస్టులో నిరంతరం పెరుగుతోంది.

ఆగస్టు నెల ఆరంభం నుంచి బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా గత 10 రోజులుగా ధరలు ఆగకుండా పెరుగుతున్నాయి. ఈ నిరంతర ధరల పెరుగుదల కారణంగా, బంగారం ధర గ్రాముకు రూ. 16,000 పైగా అమ్మడవుతోంది. ఇక వెండి విషయానికొస్తే ఈ రోజు పెరుదల లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర 1.60 లక్షల వద్ద ట్రేడవుతోంది.