Today Gold Price: మగువలకు మంచి రోజులు.. మళ్లీ రికార్డు స్థాయిలో దిగి వస్తున్న బంగారం ధరలు!

Updated on: Jul 08, 2026 | 11:46 AM

Today Gold Price: బంగారం, వెండి ధరలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ప్రతిరోజూ ఒకే విధంగా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, అమెరికా డాలర్ బలపడటం లేదా బలహీనపడటం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల..

1 / 5
 Today Gold Price: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల కాలం నుంచి ధరలు భారీ స్థాయిలో పతనం కావడం వినియోగదారులకు పెద్ద ఉపశమనం అనే చెప్పాలి. వరుసగా మూడు రోజుల నుంచి ధరలు దిగి వస్తున్నాయి.అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా డాలర్ బలపడటం, ముడి చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణ ఆందోళనలు మళ్లీ తెరపైకి రావడం, వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగవచ్చనే అంచనాలు బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి.

2 / 5
 ప్రతి రోజు బంగారం ధరలు అప్‌డేట్‌ అవుతుంటాయి. ఇందులో ఈ క్రమంలో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. అలాగే ఈ రోజు ఉదయం 11 గంటల సమయానికి బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల 10 గ్రాముల ధరపై రూ.770 తగ్గి రూ.144,490 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల 10 గ్రాము బంగారం ధర రూ.700 వరకు తగ్గి రూ.132,450 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల ధర విషయానికొస్తే దీని ధర 10 గ్రాములపై రూ.570 వరకు తగ్గిరూ.108,370 వద్ద ట్రేడ్ అవుతోంది.

3 / 5
 ఇక తెలుగు రాష్ట్రాల్లో నమోదైన ధరలను పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ 770 తగ్గి రూ.1,44,490 వద్ద కొనసాగుతుండగా, అదే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.700 తగ్గి రూ.1,32,450 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారట్ల బంగారం ధర రూ.570 తగ్గి ప్రస్తుతం రూ.1,08,370 గా నమోదైంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్న కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద ట్రేడవుతోంది.

4 / 5
 ఇక ఢిల్లీలో అయితే ధరల్లో కాస్త తేడా ఉంటుంది. ఇక్కడ 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,44,640 ఉండగా, అదే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,600 ట్రేడవుతోంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల ధర  రూ.1,08,520 వద్ద ట్రేడవుతోంది.

5 / 5
 బంగారం, వెండి ధరలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ప్రతిరోజూ ఒకే విధంగా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, అమెరికా డాలర్ బలపడటం లేదా బలహీనపడటం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల కొనుగోలు లేదా అమ్మకాల ధోరణి వంటి అనేక అంశాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంటాయి.

Follow Us