Gold Price: భారీగా పతనమైన బంగారం ధరలు.. కొనాలంటే ఇదే బెస్ట్‌ టైమ్‌..!

Updated on: Oct 22, 2026 | 10:53 AM

Gold and Silver Prices: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు భారీగా పెరుగుతాయనే భయాల నడుమ బంగారం ధరలు వారం రోజుల కనిష్ట స్థాయికి దగ్గరగా ఉన్నాయి. పెట్టుబడిదారులు ఇప్పుడు వచ్చే వారం జరగనున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ..

1 / 5
 Gold and Silver Prices Today: అక్టోబర్ 22వ తేదీన వరుసగా మూడవ రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. ఎన్నడులేనంతగా బంగారం, వెండి ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు భారీ ఊరటనిస్తున్నాయనే చెప్పవచ్చు. ఈ రోజు MCXలో వెండి ధర రూ. 4,550 మేర తగ్గి, కిలోగ్రాముకు రూ. 204,618 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 1,558 మేర తగ్గి రూ. 144,521కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో, కామెక్స్‌లో బంగారం ధర ఔన్సుకు $4,109కి చేరగా, వెండి ధర 2 శాతానికి పైగా తగ్గి ఔన్సుకు $56 వద్ద ట్రేడవుతోంది.

2 / 5
 తాజాగా దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.1700  వరకు తగ్గుముఖం పట్టింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1550 వరకు దిగి వచ్చింది. ఇక  18 క్యారెట్ల ధరపై రూ.1270 వరకు తగ్గింది. ధరలు తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,380 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,350 వద్ద కొనసాగుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,08,290 వద్ద ట్రేడవుతోంది.

3 / 5
 హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,380 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,350 వద్ద ట్రేడవుతోంది. ముంబైలో కూడా ఇదే ధరతో కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీ విషయానికొస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,530 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,500 వద్ద ట్రేడవుతున్నాయి.

4 / 5
 ఇక వెండి విషయానికొస్తే బంగారం బాటలోనే ఇది కూడా పయనిస్తోంది. వెండి రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడుతోంది. కిలోపై ఏకంగా రూ.5000 వరకు దిగి వచ్చింది. ధర తగ్గిన తర్వాత ప్రస్తుతం కేజీ సిల్వర్‌ ధర రూ.2,25,000 వద్ద కొనసాగుతోంది.

5 / 5
 మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు భారీగా పెరుగుతాయనే భయాల నడుమ బంగారం ధరలు వారం రోజుల కనిష్ట స్థాయికి దగ్గరగా ఉన్నాయి. పెట్టుబడిదారులు ఇప్పుడు వచ్చే వారం జరగనున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశంపై దృష్టి సారించారు. ఈ తగ్గుదల నేపథ్యంలో మీరు బంగారం లేదా వెండిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ధరలను సరిచూసుకోండి.

Loading...
Unable to load recommendations.
Follow Us