
బంగారం కొనుగోలుచేసేవారికి గుడ్ న్యూ్స్. గత వారం రోజుల్లో పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. ఊహించని స్థాయిలో ధరలు కుప్పకూలాయి. గత వారంగా ధరలు పడిపోతుండటంతో కొనుగోలు చేసేవారు ఊరట చెందుతున్నారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు వారం రోజుల్లో ధరలు ఎంత తగ్గాయి..? ఏయే నగరాల్లో్ ఎలా ఉన్నాయి? అనేది చూద్దాం.

సెప్టెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,680 వద్ద ఉండగా.. అక్టోబర్ 3వ తేదీ నాటికి రూ.1,49,180కి చేరుకున్నాయి. వారం రోజుల్లో ఏకంగా రూ.3500 వరకు గోల్డ్ రేట్లు తగ్గాయని చెప్పవచ్చు. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 27న రూ.1,39,950 వద్ద ఉండగా.. అక్టోబర్ 3 నాటికి రూ.1,36,750కి చేరుకున్నాయి.

22 క్యారెట్ల బంగారంపై వారం రోజుల్లో రూ.3200 తగ్గిందని చెప్పవచ్చు. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,830 వద్ద నుంచి రూ.1,49,180కి తగ్గాయి. రూ.3550 మేర ధర తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.3200 తగ్గింది.

చెన్నైలో సెప్టెంబర్ 27న 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730 వద్ద ఉండగా.. అక్టోబర్ 3 నాటికి రూ.1,49,330కి చేరుకున్నాయి. అంటే రూ.3400 తగ్గిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1.40 లక్షల నుంచి రూ.1,36,750కి చేరుకున్నాయి. అంటే రూ.3250 తగ్గింది

వెండి ధరల విషయానికొస్తే.. ఇవి కూడా వారం రోజుల్లో క్రాష్ అయ్యాయి. సెప్టెంబర్ 27న కిలో వెండి ధర రూ.2.50 లక్షలుగా ఉండగా.. అక్టోబర్ 3 నాటికి రూ.2.45 లక్షలకు చేరుకున్నాయి. అంటే రూ.5 వేల మేర తగ్గాయని చెప్పవచ్చు. పండుగల సీజన్‌లో ధరలు తగ్గడం శుభవార్తగా చెప్పవచ్చు