
Gold, Silver Prices: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. ఈ రోజు కాస్త ఉపశమనం కలిగించాయి. ప్రతి రోజు పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు మే 8న ఉదయం 10 గంటల సమయానికి తగ్గుముఖం పట్టాయి. అయితే బంగారం ధర తగ్గితే వెండి మాత్రం భారీగా పెరిగింది. కిలోపై ఏకంగా 5000 రూపాయల వరకు ఎగబాకింది.

శుక్రవారం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.320 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 31డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,718 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆశల నేపథ్యంలో డాలర్ విలువ తగ్గడం, ముడి చమురు ధరలు తగ్గడంతో జాతీయ రాజధాని బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి.

హైదరాబాద్, విజయవాడలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,950 వద్ద కొనసాగుతోంది. అలాగే ఇక్కడ కిలో వెండి ధర 2,74,900 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

ఇక ఢిల్లీలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,880 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,40,010 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికొస్తే ఇక్కడ కేజీ సిల్వర్ ధర 2,75,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,52,680 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,39,950 వద్ద కొనసాగుతోంది.