
బంగారం ధరలు భారీగా కుదేలవుతున్నాయి. రోజురోజుకు ఊహించని రీతిలో పతనమవుతున్నాయి. అమెరికా డాలర్ బలపడుతుండటం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడంతో ప్రభుత్వ ట్రెజరీ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో పెట్టుబడిదారులు బంగారంలోని తమ పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటున్నారు. దీంతో బంగారం ఆకర్షణ కోల్పోవడంతో ధరలు పడిపోతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారంతో పాటు సిల్వర్ రేట్లు కూడా క్రాష్ అవుతున్నాయి.

గురువారం గ్లోబల్ కమోడిటీ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి వల్ల బంగారం ధరలు ఔన్సుకు 3,800 డాలర్ల కంటే తక్కువకు దిగొచ్చాయి. దీంతో 14 నెలల కనిష్ట స్థాయికి గోల్డ్ ధరలు పడిపోయాయి. ఇక వెండి ధరు ఔన్సుకు 45 డాలర్లకు చేరుకోగా.. రాగి కూడా దిగొస్తుంది. త్వరలో ఫెడ్ వడ్డీ రేట్లను మరింతగా పెంచనుందనే అంచనాల క్రమంలో బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. ఈ పరిణామం బంగారం ధరలను తగ్గించేలా చేస్తుంది.

ఇవాళ ఒక్కరోజే స్పాట్ గోల్డ్ 3.2 శాతం తగ్గి ఔన్సుకు 3,726 డాలర్లకు చేరుకున్నాయి. స్పాట్ సిల్వర్ ఏకంగా 5 శాతం తగ్గి ఔన్సుకు 45.03 డాలర్లకు చేరుకుంది. ఇక భారత్‌లో నవంబర్ 19న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఒకేసారి రూ.2350 తగ్గి రూ.1,19,800కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,30,690కి పడిపోయింది. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పడిపోనున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం సవరం 8 గ్రాముల గోల్డ్ రూ. 95,840గా లభిస్తోంది. ఇక వెండి ధరల విషయానికొస్తే ఈ ఏడాది జనవరిలో రూ. 4లక్షల ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం రూ.2 లక్షల కంటే దిగువకు చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో సిల్వర్ ధరలు మరింతగా పడిపోతున్నాయి.

నిపుణుల అంచనా నిజమైతే బంగారం ధరలు ఖచ్చితంగా రూ.లక్షకు పడిపోడం గ్యారంటీ అని పలువురు భావిస్తున్నారు. ఇదే జరిగితే బంగారం కొనుగోలు చేసేవారికి భారీ ఊరటగా చెప్పవచ్చు. ఈ ఏడాది చివరినాటికి రూ.లక్షకు చేరుకుంటాయని ఆర్ధిక విశ్లేషకులు భావిస్తున్నారు. మరి బంగారం రూ.లక్షకు దిగొస్తుందా.. లేదా అనేది చూడాలి.