Gold Rates: బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారా..? ఈ టైమ్‌లో అమ్మితే లాభాలే.. లాభాలు..

Updated on: Mar 27, 2026 | 8:17 PM

చాలామంది బంగారాన్ని ఇంట్లో లేదా డిజిటల్ యాప్స్‌లలో అలాగే భద్రపర్చుకుంటారు. వాటిని ఎలా అమ్మాలో తెలియక సతమతమవుతుంటారు. అయితే బంగారం, వెండి ఎప్పుడు అమ్మాలి.. ఎప్పుడు అమ్మితే మీకు లాభాలు వస్తాయి.. మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం.

1 / 5
ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండిని ఒక ఆభరణంగానే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తారు. పసిడిలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కొంతమంది లాభాలు పొందితే.. మరికొందరు నష్టపోతుంటారు. గత కొన్నేళ్లుగా బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో ఏ సమయంలో పెట్టుబడి పెట్టాలో తెలియక చాలామంది నష్టపోతుంటే.. మరికొందరు దీనిని అనుకూలంగా మార్చుకుంటున్నారు

2 / 5
కొంతమంది బంగారాన్ని శాశ్వతంగా దాచిపెట్టుకుంటారు. బ్యాంకు లాకర్లలో లేదా డీమ్యాట్ అకౌంట్‌లో, గోల్డ్ బాండ్లలో ఉంచుకుంటారు. అయితే బంగారం శాశ్వతంగా ఉంచుకోకూడదు. అలా ఉంచుకోవడం వల్ల మీకు స్థిరమైన ఆదాయం రాదు. ప్రజల మానసిక స్థితి, భయాలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ అనిశ్చితిని బట్టి ధరలు మారుతూ ఉంటాయి.  దీంతో కొన్నిసార్లు బంగారం, వెండి అమ్మడం వల్ల లాభాలు పొందవచ్చు.

3 / 5
బంగారం ధరలు పెరిగినప్పుడు మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న పెట్టుబడి ఒక్కసారిగా పెరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో మీరు కొంత బంగారాన్ని విక్రయించడం వల్ల డబ్బులు వస్తాయి. బంగారం మొత్తాన్ని అమ్మడం కాకుండా కొంత మొత్తాన్ని అమ్ముకోవడం తెలివైన పని అని చెప్పవచ్చు. ఇక యుద్దాలు, ఆందోళనల సమయంలో ప్రజల సెంటిమెంట్ కారణంగా ధరలు పెరుగుతాయి.

4 / 5
ధరలు ఒక్కసారిగా వేగంగా పెరిగినప్పుడు చిన్న లాభాలను తీసుకోవచ్చు. ఇలాంటి సమయంలో మొత్తం అమ్మకుండా కొంతమొత్తాన్ని విక్రయించడం ఉత్తమ మార్గం. ఇక మీకు అవసరాల కోసం డబ్బులు అవసరమైనప్పుడు బంగారాన్ని విక్రయించాలి. ఇలాంటి సమయంలో మరింతగా పెరుగుతుందేమోనని చాలామంది ఆలోచిస్తారు. కానీ అవసరమైనప్పుడు అమ్ముకోవాలి.

5 / 5
ఇక ఇతర పెట్టుబడి అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పుడు గోల్డ్‌లో కొంత భాగాన్ని అమ్మేసి అధిక ఆదాయం వచ్చే పెట్టుబడిలో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు కొన్ని స్టాక్స్ తక్కువ ధరకు లభిస్తాయి. ఇలాంటి సమయంలో కొంత బంగారాన్ని అమ్మేసి వీటిల్లో పెట్టుబడులు పెట్టండి.

Follow Us