
బంగారం ధరలపై భారీ గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పతనమవయ్యాయి. వారంలో తొలి రోజు గోల్డ్ ప్రియులకు భారీ ఊరట కల్పించాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం మొదలుకావడం, ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్న క్రమంలో అధిక వడ్డీ వచ్చే పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో బంగారానికి డిమాండ్ తగ్గడంతో ధరలు కుప్పకూలుతున్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఈ క్రాష్ తర్వాత సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు రూ.1420 మేర క్రాష్ అయింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,31,000 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఒక్కరోజే రూ.1300 మేర పడిపోయింది. అటు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రూ.1,44,000గా ఉంది. సోమవారం ఒకరోజే రూ.1090 క్రాష్ అయింది. అటు 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1.32 లక్షలు వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ రూ.వెయ్యి మేర డౌన్ అయింది. అటు బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1.31 లక్షల వద్ద ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,060 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,31,150గా ఉంది. అటు ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1.31 లక్షలుగా ఉంది. అటు వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.40 లక్షల వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో కూడా ఇదే ధర ఉండగా.. బెంగళూరులో రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది. అటు ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.35 లక్షల వద్ద ట్రేడవుతోంది.