
Today Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలుకు బ్రేకులు పడ్డాయి. ఇటీవల పెరిగిన ధరల నేపథ్యంలో పెట్టుబడిదారులు లాభాల బుకింగ్ చేయడం, అలాగే అమెరికన్ డాలర్ బలపడటం వంటి కారణాల వల్ల ఈ పతనం నమోదైనట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన పరిస్థితులు దేశీయ బులియన్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపడంతో ధరలు కొంత మేర తగ్గినట్లు కనిపిస్తోంది.

అయితే ప్రతి రోజు ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు అప్‌డేట్ అవుతుంటాయి. అలాగే సోమవారం ధరలు అప్‌డేట్ అయిన తర్వాత భారీగా తగ్గుముఖం పట్టాయి.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 1950 రూపాయలు తగ్గుముఖం పట్టగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1800 వరకు దిగి వచ్చింది. అలాగే వెండి విషయానికొస్తే దీనిపై ఏకంగా 5000 రూపాయల వరకు తగ్గింది.

ధరలు తగ్గిన తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,200 రూపాయల వరకు దిగి వచ్చింది.

ఇక వెండి విషయానికొస్తే ధర తగ్గిన తర్వాత కిలో వెండి ధర హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో 2,90,000 రూపాయల వద్ద కొనసాగుతుండగా, ఇతర రాష్ట్రాల్లో 2,80,000 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి.