
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా క్షిపణులతో దాడులు చేపట్టుతుండటం, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేపడుతున్న క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీని వల్ల విమానాలు భారీగా రద్దు కావడంతో పాటు మళ్లింపులు చేపడుతున్నారు. దీని వల్ల విమాన ప్రయాణాలు క్లిష్టంగా మారుతున్నాయి. విమాన కార్యకలాలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు

అయితే విమానం రద్దు లేదా ఆలస్యం జరిగితే ట్రావెల్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా.. లేదా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే పాలసీ నిబంధనలు, అంతరాయానికి సంబంధించి నిర్దిష్ట కారణాలను బట్టి ప్రయాణ బీమా రద్దు, ఆలస్యానికి కూడా వర్తించవచ్చు. చాలా సందర్భాల్లో వాతావరణ పరిస్థితులు, ఎయిర్ లైన్ సమ్మెలు, విమానంలో టెక్నికల్ సమస్యలు వంటి కారణాలకు కూడా బీమా కవరేజ్ రావొచ్చు.

కొన్ని ట్రావెల్ ఇన్యూరెన్స్ పాలసీలు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. విమానం ఆలస్యమైతే పరిహారం, ట్రిప్ రీషెడ్యూలింగ్, విమానం ఆలస్యమైతే రాత్రిపూట బస వంటి ఖర్చులను కూడా కవర్ చేస్తాయి. ఏది కవర్ అవుతుంది.. ఏది కవర్ అవ్వదు అని తెలుసుకోవడానికి పాలసీ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. లేదా బీమా సంస్థను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి.

విమానాలు ఆలస్యం లేదా రద్దు అయినప్పుడు ఆటోమేటిక్‌గా బీమా పరిధిలోకి వస్తాయని భావించకూడదు. పాలసీలో కవరేజ్ భిన్నంగా ఉంటుంది. దీంతో ప్రయాణానికి ముందు నియమ, నిబంధనల గురించి తెలుసుకోండి. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఇది సహాయపడుతుంది.

ట్రావెల్ ఇన్యూరెన్స్ తీసుకునే సమయంలో మీరు ఎంచుకున్న ఎంపికలు, నియమాలకు బట్టి మీరు ఆలస్యాలు, రద్దుకు బీమా కవరేజీ పొందవచ్చు. ఆలస్యం, రద్దుకు గల కారణాలు, క్లెయిమ్ దాఖలు చేయడానికి గల డాక్యుమెంట్స్‌తో పాటు పాలసీ వివరాలను జాగ్రత్తగా సమీక్షించుకోవాలి. బీమా కవరేజ్‌తో పాటు అదనపు ప్రయోజనాలను అందిస్తుందో.. లేదో చూసుకోవాలి.