EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం బిగ్ న్యూస్..! అమౌంట్ రూ.7,500కి పెంపు..? పండుగే

Updated on: Oct 25, 2026 | 11:34 AM

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి త్వరలో శుభవార్త అందనుంది. పెన్షన్ పరిమితిని పెంచే అవకాశముందని తెలుస్తోంది. నవంబర్‌లో జరుగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. ఇదే జరిగితే పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెన్షన్ ఎక్కువ అందనుంది.

1 / 5
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం మరో తీపికబురు అందించేందుకు సిద్దమవుతోన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈపీఎఫ్ఓలో కేంద్రం అనేక సంస్కరణలు ప్రవేశపెడుతోంది. పీఎఫ్ పోర్టల్‌లో మార్పులు చేయడంతో పాటు విత్ డ్రా, పెన్షన్ రూల్స్‌లో మార్పులు చేసింది. పీఎఫ్ సేవలను మరింత సరళతరం చేయడం, మరింతమంది ఉద్యోగులకు వీటి సేవలను విస్తరించే దిశగా కొత్త నిర్ణయాలకు నాంది పలుకుతోంది. ఆ దిశగా ఇప్పుడు మోదీ సర్కార్ మరో బిగ్ డెసిషన్ తీసుకునే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

2 / 5
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్(EPS) కింద పెన్షన్ ప్రయోజనాలు కూడా అందుతాయి. ప్రతీ నెలా ఈ పెన్షన్ కాంట్రిబ్యూషన్ అనేది ఎంప్లాయర్, ఎంప్లాయిస్ షేర్‌తో పాటు జమ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి కేవలం రూ.వెయ్యిగా ఉండగానే.. దీనిని మరింత పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. పలుమార్లు ఉద్యోగ సంఘాలు దీనిపై ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టాయి.

3 / 5
నవంబర్ 19వ తేదీన గుజరాత్‌లోని గిర్‌లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కనీస పెన్షన్ పరిమితిపై చర్చించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం సానుకూల నిర్ణయం వెలువడొచ్చని సమాచారం. 2014 నుంచి కనీస పెన్షన్ రూ.వెయ్యిగా కొనసాగుతోంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి మార్పులు జరగలేదు. ప్రస్తుతం ఖర్చులు పెరిగిన క్రమంలో పెన్షన్ పెంచాలనే ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయి.

4 / 5
ఇప్పుడు కనీస పెన్షన్‌ను రూ.వెయ్యి నుంచి రూ.7,500  పెంచే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు పెరగడం, వైద్య ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడంతో రూ.వెయ్యి పెన్షన్ ఎందుకు సరిపోవడం లేదు. దీంతో పెన్షన్‌ను రూ.7,500కి పెంచడం వల్ల ఉద్యోగులకు బెనిఫిట్ జరుగుతుందని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ అధికారులను పలుమార్లు కలిసి ప్రతిపాదనలు కూడా సమర్పించాయి.

5 / 5
కేంద్రం ఇటీవల ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో రూ.25 వేల వరకు శాలరీ పొందేవారికి పీఎఫ్ అకౌంట్ తప్పనిసరి కానుంది. గతంలో రూ.15 వేలబడి జీతం తీసుకునేవారికి ఆప్షనల్‌గా ఉండేది. దీంతో పెన్షన్ పెంపుపై కూడా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకొవచ్చని ఉద్యోగులు ఆశిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us