Credit Card: ఈ పరిస్థితుల్లో భర్త మరణిస్తే భార్య క్రెడిట్ కార్డు బిల్లు కట్టాల్సిందే.. ఈ రూల్స్ చాలామందికి తెలియవు..

Updated on: Oct 24, 2026 | 9:52 PM

భర్త మరణిస్తే అతడి క్రెడిట్ కార్డు బిల్లును భార్య చెల్లించాల్సి ఉంటుందా..? ఈ అనుమానం చాలామందికి ఉంటుంది. కొన్ని పరిస్థితులు చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ మేరకు బ్యాంకింగ్ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో భార్య చెల్లించాల్సి ఉంటుందనే విషయం ఇందులో తెలుసుకుందాం.

1 / 5
ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించే చాలామందికి రూల్స్ గురించి సరిగ్గా తెలియదు. బిల్లింగ్ సైకిల్, మినిమం డ్యూ, ఆలస్యపు ఛార్జీలు, పెనాల్టీలు వంటి వాటి గురించి అవగాహన కలిగి ఉండాలి. ఇటీవల క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. కొంతమంది బిల్లులు చెల్లించలేక అప్పులపాలవుతున్నారు. క్రెడిట్ కార్డుదారుడు మరణించిన సమయంలో అతడి కుటుంబసభ్యులకు బిల్లు చెల్లించాల్సిన బాధ్యత ఉంటుందా..?

2 / 5
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణించిన సమయంలో అతడి బిల్లును కుటుంబసభ్యులు చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. అయితే బ్యాంక్ అతడి ఆస్తి నుంచి వీటిని వసూలు చేయవచ్చు. అతడి బ్యాంక్ అకౌంట్లోని సొమ్ము, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఆస్తులు, ఇన్సూరెన్స్ పాలసీల నగదు నుంచి వసూలు చేస్తాయి. అలాగే అతడికి ఉన్న స్థిర,చరాస్తులను వేలం వేయడం ద్వారా వచ్చే సొమ్ము ద్వారా వసూలు చేసుకోవచ్చు.

3 / 5
కార్డుదారుడి పేరుపై ఎలాంటి ఆస్తి లేనప్పుడు వసూలు కాని బకాయిగా పరిగణించి బ్యాంకులు రద్దు చేస్తాయి. అంతేకానీ కార్డుదారుడు మరణిస్తే భార్య లేదా కుటుంబసభ్యులు చెల్లించమని బలవంత పెట్టలేవు. కార్డుదారుడు చెల్లించని సొమ్ముకు కుటుంబసభ్యులు బాధ్యులు కారని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నారు. అయితే భర్త కార్డుకు భార్య పేరు జోడిస్తే అప్పుడు చెల్లించాల్సి ఉంటుంది.

4 / 5
అంతేకాకుండా ఏదైనా ఒప్పందం ప్రకారం బకాయిలు చెల్లించే బాధ్యతను భార్య తీసుకుంటే అప్పుడు చెల్లించాల్సి రావొచ్చు. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో భర్త మరణిస్తే అతడి క్రెడిట్ కార్డు బిల్లును భార్య చెల్లించాల్సి ఉంటుంది. మిగతా పరిస్థితుల్లో భార్యను చెల్లించాల్సిందిగా ఆర్ధిక సంస్థలు బలవంత పెట్టలేవని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ నిబంధనల గురించి అవగాహన కలిగి ఉండాలి.

5 / 5
బ్యాంకులు ఎక్కువగా కార్డుదారుడి ఆస్తుల నుంచి వసూలు చేస్తాయి. ఉదాహరణకు రూ.2 లక్షల క్రెడిట్ కార్డు బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు అతడి పేరుపై ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ అమౌంట్ నుంచి వాటిని తీసుకుంటారు. క్రెడిట్ కార్డులు జారీ చేసేటప్పుడు బ్యాంకులు ఎలాంటి గ్యారంటీ తీసుకోవు. దీంతో కుటుంబసభ్యులకు ఎలాంటి బాధ్యత ఉండదు.

Loading...
Unable to load recommendations.
Follow Us