
బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ పేరుతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. తాజాగా హోమ్ ఇంటర్నె్ట్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. ఒక నెల రీఛార్జ్ ఉచితంగా అందించనుంది. ఇందుకోసం వార్షిక ప్లాన్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ వార్షిక ప్లాన్‌లో 12 నెలలు రీఛార్జ్ చేసుకుంటే.. అదనంగా మరో నెల ఉచితంగా సేవలు పొందోచ్చు.

కస్టమర్లు ఈ వార్షిక ప్లాన్ ఎంచుకుని రీఛార్జ్ చేసుకుంటే.. 13 నెలల పాటు ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఓటీపీ యాప్స్ యాక్సెస్ చేయవచ్చు. ఒక నెల సేవ పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ పొందాలంటే ప్రతి నెలా రూ. 799 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 150 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అందుతుంది. ప్రతి నెలా 4,000 GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు.

వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసులు, గేమింగ్, 4K వీడియో స్ట్రీమింగ్ వినియోగించుకునేవారు మెరుగైన క్వాలిటీ ఈ డేటా ద్వారా పొందవచ్చు. అలాగే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ 4 వేల జీబీ డేటా పరిమితి ముగిశాక కూడా ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. కాకపోతే డేటా స్పీడ్ 10 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది.

ఇంటర్నెట్‌తో పాటు ఈ ప్లాన్‌లో భారీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్ కూడా ఉంది. 25కు పైగా ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లను ఉచితంగా వాడుకోవచ్చు. 12 నెలలకు మొత్తం రూ.9588 చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.799 ఖర్చు అవుతుంది. అనంతరం ఒక నెల ఉచితంగా పొందటం వల్ల రూ.799 ఆదా అవుతాయి.

ఒకే కనెక్షన్‌పై పని, చదువు మరియు వినోదం పొందే కుటుంబాలకు ఈ ప్లాన్ ఆకర్షణీయంగా ఉంటుంది. 13 నెలల సర్వీస్‌తో పాటు 12 నెలల సబ్‌స్క్రిప్షన్‌పై డేటా, OTT ప్యాక్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ కోసం మీ స్థానిక BSNL కార్యాలయాన్ని సంప్రదించండి.