
PNB Account: మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో ఖాతా ఉండి, దానిని మీరు చాలా కాలంగా ఉపయోగించకపోతే ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. గత 3 సంవత్సరాలుగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగని అటువంటి బ్యాంకు ఖాతాలను శాశ్వతంగా మూసివేయడానికి PNB సిద్ధమవుతోంది.

ఈ నిర్ణయం 30 సెప్టెంబర్ 2026 నాటికి 3 సంవత్సరాల నిరంతరంగా నిలిచిపోయిన కాలాన్ని పూర్తి చేసుకున్న ఖాతాలకు వర్తిస్తుంది. ప్రత్యేకంగా, ఒక్క లావాదేవీ కూడా జరగని, జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను బ్యాంకు భద్రతా చర్యల కింద మూసివేస్తుంది.

చాలా కాలంగా నిలిచిపోయిన ఇటువంటి ఖాతాలను సైబర్ నేరగాళ్లు లేదా మోసగాళ్లు దుర్వినియోగం చేయకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకుంటోంది. వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి, బ్యాంకింగ్ వ్యవస్థను ప్రమాద రహఙతంగా ఉంచడానికి బ్యాంకు ప్రక్షాళన చేపట్టింది.

అయితే తమ ఖాతాలను కొనసాగించాలనుకునే వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం.. గడువులోగా అవసరమైన డాక్యుమెంట్లను అందించి అకౌంట్‌ను యాక్టివ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో బ్యాంకింగ్ సేవలకు ఎటువంటి అంతరాయం ఉండదు. అకౌంట్‌ను కాపాడుకోవడానికి వినియోగదారులు 10 నవంబర్ 2026లోపు తమ సమీపంలో పీఎంన్‌బీ శాఖను వ్యక్తిగతంగా సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంకు సూచించిన కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియ అవసరమైన చెల్లుబాటు అయ్యే గుర్తింపు, చిరునామా పత్రాలను (పాన్, ఆధార్, ఇటీవల పాస్‌పోర్ట్ సూజు ఫోటో) బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో తొందరపాటు, సమస్యలను నివారించడానికి ఈ ప్రక్రియను గడువు తేదీకి చాలా ముందుగానే పూర్తి చేయడం తప్పనిసరి బ్యాంకు సూచిస్తోంది.