
మీరు వచ్చే వారంలో బ్యాంక్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే బ్యాంక్ సెలవుల గురించి ఒకసారి తెలుసుకోండి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం వచ్చే వారంలో బ్యాంకులు ఏయే రోజులు మూతపడతాయనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. సెలవుల గురించి తెలుసుకోకుండా బ్యాంక్‌కి వెళితే సమయం వృథా అవుతుంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో సెలవులు ఒకేలా ఉండవు.

ప్రాంతీయ పండుగలను బట్టి బ్యాంక్ హాలీడేస్ వేర్వురుగా ఉంటాయి. దీంతో మీ ప్రాంతంలో ఏయే రోజుల్లో బ్యాంకులు క్లోజ్ అయి ఉంటాయనేది ముందే తెలుసుకోవాలి. ఏదైనా సందేహాం ఉంటే ముందుగా బ్యాంక్ సిబ్బందిని సంప్రదించి సమాచారం తెలుసుకోవాలి. రెండో శనివారం, పండుగలు వస్తుండటంతో వచ్చే వారంలో బ్యాంకులు ఏయే రోజులు మూతపడతాయనేది చూద్దాం.

అక్టోబర్ 5 నుంచి 11వ తేదీ వరకు బ్యాంక్ సెలవులను పరిశీలిస్తే.. అక్టోబర్ 5 నుంచి 9వ తేదీ వరకు తెరిచే ఉంటాయి. అక్టోబర్ 10న రెండో శనివారం వస్తోంది. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ప్రతీ రెండో శనివారం బ్యాంకులకు సాధారణ సెలవు. దీంతో ఆ రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక అక్టోబర్ 11న ఆదివారం కూడా సాధారణ సెలవు దినం కావడంతో బ్యాంకులు ఉండవు.

రాష్ట్రం, ప్రాంతాన్ని బట్టి బ్యాంక్ సెలవులు మారవచ్చు. దీంతో బ్రాంచ్‌ను సందర్శించేముందు ఒకసారి సిబ్బందిని సంప్రదించి నిర్ధారణ చేసుకోవడం మంచిది. అక్టోబర్ 3న తొలి శనివారం కావడంతో ఇవాళ బ్యాంకులు తెరిచే ఉంటాయి. కేవలం నెలలో రెండు, నాల్గొ శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవు. తొలి, మూడు, ఐదో శనివారాల్లో బ్యాంకులు యథావిధిగా ఉంటాయి.

బ్యాంకులు మూతపడ్డా ఆన్ లైన్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. ఇంటర్నెట్, మొబైల్, ఏటీఎం, యూపీఐ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. దీంతో వీటిని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. వీటి ద్వారా ఏ సమయంలోనైనా నిధులు బదిలీ చేసుకోవచ్చు.