
బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే రోజువారీ అవసరాల కోసం బ్యాంక్ లావాదేవీలతో ప్రతీఒక్కరికీ అవసరం ఉంటుంది. దీంతో బ్యాంక్ హాలీడేస్ ఎప్పుడెప్పుడు ఉంటాయనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల లావాదేవీలను ముందే ప్లాన్ చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారం వచ్చే వారంలో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకుందాం.

అక్టోబర్ 26వ తేదీన లక్ష్మీ పూజ, మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా అగర్తలా, బెంగళూరు, చండీగఢ్, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్‌లలోని బ్యాంకులు మూతపడనున్నాయి. అక్టోబర్ 29న గురువారం కర్వా చౌత్ సందర్భంగా షిమ్లాలో బ్యాంకులు ఉండవు. అక్టోబర్ 31 (శనివారం)రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా అహ్మదాబాద్‌లోని బ్యాంకులు తెరుచుకోవు.

నవంబర్ 1 (ఆదివారం) బ్యాంకులకు సాధారణ సెలవు కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. రాష్ట్రాన్ని బట్టి బ్యాంక్ సెలవులు మారుతూ ఉంటాయి. స్థానిక పండుగల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వచ్చే వారంలో బ్యాంకులు మూతపడనున్నాయి. అలా ఉంచితే తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారంలో బ్యాంకులు యథావిధిగా అన్ని రోజులు పనిచేయనున్నాయి.

అక్టోబర్ 24వ తేదీన నాలుగో శనివారం ఇవాళ దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్ అయ్యాయి. అక్టోబర్ 25 ఆదివారం కావడంతో బ్యాంకులు ఉండవు. దీంతో తిరిగి అక్టోబర్ 26వ తేదీన బ్యాంకులు యథావిధిగా తెరుచుకోనున్నాయి. దీంతో బ్యాంక్ బ్రాంచులను సందర్శించాలనుకునేవారు సోమవారం వెళ్లాలి.

ఆర్బీఐ బ్యాంక్ సెలవులను మూడు వర్గాలుగా విభజించింది. జాతీయ సెలవుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. ఇక రాష్ట్రాల్లోని ప్రాంతీయ సెలవు దినాల్లో ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రకటించే సెలవు రోజుల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకులను సందర్శించేముందు ఒకసారి నిర్ధారణ చేసుకోవడం మంచిది.