
తమ డబ్బులను పొదుపు చేసుకునేందుకు చాలామంది సాంప్రదాయ మార్గమైన ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకుంటారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంక్ ఎఫ్‌డీలలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. దీని వల్ల ఆదాయం రావడంతో పాటు డబ్బులు సురక్షితంగా ఉంటాయని భావిస్తారు. అయితే బ్యాంక్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొని దివాళా తీసినా లేదా ఆర్‌బిఐ ఆంక్షలు విధించి బ్యాంక్ మూతపడ్డా లేదా నిబంధనలు ఉల్లంఘించినందుకు బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయబడినా తమ డబ్బు ఏమవుతుందోనని ఖాతాదారులు ఆందోళన పడుతుంటారు.

అయితే బ్యాంకులు దివాళా తీసినప్పుడు ఖాతాదారులు ఎటువంటి భయాందోళన పడాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు బ్యాంకుల్లో జమ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. ఆర్బీఐ డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ద్వారా డిపాజిట్ ఇన్సూరెన్స్ గ్యారంటీ కల్పిస్తోంది. బ్యాంకుల్లో జమ చేసే డిపాజిట్లకు ఈ బీమా కవరేజీ రక్షణ కల్పిస్తోంది. దీని కోసం మీరు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు

మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇది ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. దీంతో ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతో ఒక డిపాజిటర్‌కు ఒక బ్యాంకులో జమ చేసే డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. ఒకే బ్యాంకులో రూ.50 లక్షల డిపాజిట్ చేసినా డీఐసీజీసీ ద్వారా కేవలం రూ.5 లక్షలు మాత్రమే బీమా కవరేజీ అందుతుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారు మీ పొదుపులను రక్షించుకోవడానికి జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలి. పెద్ద మొత్తాలను డిపాజిట్ చేసేటప్పుడు ఒకే బ్యాంకులో కాకుండా వివిధ బ్యాంకుల్లో జమ చేయడం మంచిది పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కూడా బీమా కవరేజీ లభిస్తుంది. దీంతో పోస్టాఫీసులో కూడా ఎఫ్‌డీ, ఆర్డీ వేయవచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు తెలివైన వ్యూహాలను అనుసరించడం మంచిది.

డీఐసీజీసీ నియమాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు అధికారిక సమాచారాన్ని ధృవీకరించడం మీ పొదుపులకు భద్రతను అందిస్తుంది. చాలామందికి ఈ బీమా కవరేజీ సౌకర్యం గురించి తెలియదు. ఒకే బ్యాంకులో మొత్తం డిపాజిట్ చేస్తూ ఉంటారు. దీంతో బీమా నిబంధనల గురించి తెలుసుకోవాలి.