AC: మీరు 12 గంటల పాటు ఏసీ వాడితే ఎంత కరెంటు బిల్లు వస్తుందో తెల్సా..

Updated on: May 10, 2026 | 11:20 AM

రోజూ 12 గంటలు ఏసీ వాడితే నెలకి ఎంత కరెంట్ బిల్లు వస్తుంది? 1 టన్, 1.5 టన్, 2 టన్ ఏసీల మధ్య విద్యుత్ వినియోగం తేడా ఏంటి? స్టార్ రేటింగ్ వల్ల బిల్లు ఎంత తగ్గుతుంది? మీ గది సైజును బట్టి ఏ ఏసీ కొనడం లాభదాయకమో ఈ కథనంలో వివరంగా చూడండి.

1 / 5
వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి ఏసీ తప్పనిసరి. కానీ బిల్లు చూస్తే గుండె గుభేలుమంటుంది. అసలు మీ ఏసీ ఎంత కరెంట్ తాగుతుందో తెలిస్తే, మీరు దాన్ని పొదుపుగా వాడుకోవచ్చు. సాధారణంగా ఒక ఏసీ వినియోగం దాని టన్నుల సామర్థ్యం, స్టార్ రేటింగ్‌ పై ఆధారపడి ఉంటుంది.

2 / 5
మీ బెడ్‌రూమ్ లేదా హాల్ సైజును బట్టి ఏసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. చిన్న గదికి 1 టన్, మీడియం గదికి 1.5 టన్ ఏసీ సరిపోతుంది. సరైన సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకుంటేనే కరెంటు బిల్లు అదుపులో ఉంటుంది.

3 / 5
సాధారణంగా 1 టన్ ఏసీ గంటకు సుమారు 0.8 నుండి 1 యూనిట్ వరకు విద్యుత్తును వినియోగిస్తుంది. దీనిని రోజుకు 12 గంటలు వాడితే సుమారు 10-12 యూనిట్లు ఖర్చవుతాయి. అదే 1.5 టన్ ఏసీ అయితే గంటకు 1.2 నుండి 1.5 యూనిట్లు, అంటే రోజుకు 15-18 యూనిట్లు తీసుకుంటుంది. ఇక 2 టన్ ఏసీ విషయానికి వస్తే ఇది గంటకు 2 యూనిట్ల వరకు వినియోగించి, రోజుకు 20-24 యూనిట్ల వరకు బిల్లును పెంచుతుంది. నెలకు సుమారు రూ. 7 నుండి రూ. 10 వరకు యూనిట్ ధర ఉంటే, మీ ఏసీ బిల్లు మాత్రమే నెలకు రూ. 3 వేల నుండి రూ. 7 వేల వరకు ఉండే అవకాశం ఉంది.

4 / 5
ఏసీ కొనేముందు మీ గది వైశాల్యాన్ని గమనించాలి. 100 చదరపు అడుగుల లోపు గది ఉంటే 1 టన్ ఏసీ సరిపోతుంది. 150 చదరపు అడుగుల వరకు ఉంటే 1.5 టన్ ఏసీ, అంతకంటే పెద్ద గది అయితే ఖచ్చితంగా 2 టన్ ఏసీ ఉండాలి. చిన్న గదిలో పెద్ద ఏసీ వేసినా, పెద్ద గదిలో చిన్న ఏసీ వేసినా కరెంటు బిల్లు అనవసరంగా పెరుగుతుంది.

5 / 5
ఏసీని ఎప్పుడూ 24°C నుండి 26°C మధ్య ఉంచడం వల్ల కరెంటు ఆదా అవుతుంది. అలాగే ఏసీతో పాటు తక్కువ స్పీడ్‌లో ఫ్యాన్ వాడటం వల్ల గది అంతటా చల్లదనం త్వరగా వ్యాపిస్తుంది. కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉంచడం, నెలకోసారి ఫిల్టర్లు శుభ్రం చేయడం వల్ల ఏసీపై భారం తగ్గి బిల్లు అదుపులో ఉంటుంది.

Follow Us