
ఒకప్పుడు నిమ్మకాయలు చవకగా దొరికేవి, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం కిలో నిమ్మకాయల ధర రూ.150 వరకు ఉంది. రోజుకు ఒక 3 కిలోలు వాడినా రూ.450 అవుతుంది. ఇక పంచదార, గ్యాస్, గ్లాసులు, సబ్జా గింజలు, ప్యాకింగ్ కవర్లు అన్నీ కలిపి రోజువారీ మెటీరియల్ ఖర్చు సుమారు రూ.1,480 వరకు వస్తోంది.

దీనికి తోడు ఫ్లేవర్లు (ఎసెన్స్) కోసం సీజన్ ప్రారంభంలోనే ఒక పదివేల రూపాయల వరకు కేటాయించాల్సి ఉంటుంది. అంటే, రోజువారీ రన్నింగ్ ఖర్చు రూ.1,500 లోపు ఉంటుందని మనం అంచనా వేయవచ్చు.

లాభాల మాటేమిటి? సాధారణంగా ఒక గ్లాసు సోడాను మనం రూ.20కి అమ్ముతాము. రోజుకు సుమారు 4 కట్టల గ్లాసులు (దాదాపు 130 గ్లాసులు) అమ్మగలిగితే, రూ.2,600 వరకు ఆదాయం వస్తుంది. ఇందులో మన రోజువారీ పెట్టుబడి రూ.1,480 తీసేస్తే, నికరంగా రూ.1,160 మిగులుతుంది.

అయితే, బండిని తీసుకురావడానికి అయ్యే ట్రాన్స్‌పోర్ట్, పెట్రోల్ ఖర్చులు ఒక రూ.200 తీసేసినా, రోజుకు రూ.900 నుండి రూ.1,000 వరకు గౌరవప్రదమైన లాభం సంపాదించవచ్చు. అంటే నెలకు రూ.25,000 నుండి రూ.30,000 వరకు సంపాదించే అవకాశం ఉంది. ఏ ఆఫీసులోనో పని చేసే దానికంటే, సొంతంగా ఇలాంటి వ్యాపారం చేసుకుంటే ఉండే స్వేచ్ఛే వేరు.

ఏ వ్యాపారమైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది. సోడా వ్యాపారంలో ఎండలో నిలబడటం కొంచెం కష్టమైనా, సాయంత్రానికి ఇంటికి వెళ్లేటప్పుడు వెయ్యి రూపాయలు జేబులో ఉంటే ఆ తృప్తే వేరు. మీరు కూడా చిన్నగా ఏదైనా మొదలుపెట్టాలనుకుంటే, ఈ వేసవికి ఇది మంచి ప్రారంభం కావచ్చు. ఏమంటారు?