బ్రౌన్ రైస్ – వైట్ రైస్ మధ్య తేడా ఏంటీ..? అసలు ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకోండి..

Updated on: May 24, 2026 | 7:55 PM

భారతీయుల ఆహారంలో అన్నం ఒక ముఖ్యమైన భాగం. రోజులో ఒక్కసారైనా అన్నం తినకపోతే అసలు తిన్నట్లే ఉండదు. అయితే ఈ మధ్యకాలంలో ఫిట్‌నెస్, ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో మార్కెట్లో బ్రౌన్ రైస్ హవా నడుస్తోంది. చాలామంది తెల్ల బియ్యాన్ని పక్కనబెట్టి బ్రౌన్ రైస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? వైట్ రైస్‌ను ప్రాసెస్ చేయడం వల్ల వచ్చే నష్టాలేంటి? అనే విషయాలు తెలుసుకుందాం..

1 / 6
తయారీ విధానంలో తేడా: బ్రౌన్ రైస్‌ను ఒక సంపూర్ణ ధాన్యంగా పరిగణిస్తారు. వరి వలిచినప్పుడు కేవలం పైన ఉండే పొట్టును మాత్రమే తొలగిస్తారు. దీనివల్ల బియ్యం గింజపై ఉండే తవుడు వంటివి అలాగే ఉంటాయి. అందుకే ఇది గోధుమ రంగులో ఉంటుంది. తెల్ల బియ్యాన్ని పాలిష్ చేసి, బాగా ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రాసెసింగ్ కారణంగా బియ్యంపై ఉండే పోషక విలువలు కలిగిన పొరలన్నీ పోతాయి. ఫలితంగా అది మరింత తెల్లగా, మృదువుగా, పొడవుగా మారుతుంది.

2 / 6
పోషకాల వేటలో గెలుపు ఎవరిది: పోషకాల పరంగా చూసుకుంటే బ్రౌన్ రైస్ చాలా ముందుంటుంది. ఇందులో శరీరానికి అవసరమైన ఫాస్ఫరస్, విటమిన్ బి, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పాలిష్ చేయడం వల్ల ఇందులో పోషకాలు తగ్గిపోయి, కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే అధికంగా మిగులుతాయి.

3 / 6
బరువు తగ్గడానికి - జీర్ణక్రియకు: బ్రౌన్ రైస్ జీర్ణక్రియకు చాలా మంచిదని నిపుణులు భావిస్తారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనం తిన్న ఆహారం నెమ్మదిగా అరుగుతుంది. దీనివల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్నట్లు అనిపించి, పదే పదే తినాలనే కోరిక తగ్గుతుంది. ఫలితంగా బరువు అదుపులో ఉంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. అదే తెల్ల బియ్యంలో పీచుపదార్థం చాలా తక్కువగా ఉండటం వల్ల అది త్వరగా జీర్ణమైపోయి, తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుంది. దీనివల్ల మనం ఎక్కువ కేలరీలు తీసుకునే అవకాశం ఉంది.

4 / 6
మధుమేహం ఉన్నవారికి ఏది మేలు: చక్కెర వ్యాధి ఉన్నవారు అన్నం తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే గ్లైసెమిక్ ఇండెక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. బ్రౌన్ రైస్‌కు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఒకేసారి కాకుండా చాలా నెమ్మదిగా పెంచుతుంది. అందుకే మధుమేహం ఉన్నవారికి బ్రౌన్ రైస్ ఒక అద్భుతమైన ఎంపికగా మారుతుంది. తెల్ల బియ్యానికి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచేస్తుంది.

5 / 6
గుండె ఆరోగ్యం - కొలెస్ట్రాల్: నిత్యం బ్రౌన్ రైస్ తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. దీనికి విరుద్ధంగా తెల్ల బియ్యాన్ని ప్రతిరోజూ అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, ఇతర జీవక్రియ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

6 / 6
ఏది ఎంచుకోవాలి: మీరు బరువు తగ్గాలి అనుకున్నా, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఉన్నా లేదా డయాబెటిస్, గుండె జబ్బులు వంటి సమస్యలతో బాధపడుతున్నా వైట్ రైస్‌కు ప్రత్యామ్నాయంగా బ్రౌన్ రైస్‌ను డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమమైన నిర్ణయం. ఒకవేళ బ్రౌన్ రైస్ రుచి నచ్చని వారు, కనీసం సింగిల్ పాలిష్ పట్టిన బియ్యాన్ని లేదా వైట్ రైస్‌తో పాటు ఎక్కువ పరిమాణంలో కూరగాయలు, పీచుపదార్థం ఉండేలా చూసుకోవడం మంచిది.

Follow Us