ఈ 3 కూరగాయలను వండే ముందు ఇలా చేస్తే క్యాన్సర్ దూరం

Updated on: Sep 15, 2026 | 9:29 PM

సాధారణంగా మనం కూరగాయలను కోసిన వెంటనే వండటం మంచిదని భావిస్తాము. అలా చేస్తే వాటిలోని పోషకాలు కోల్పోకుండా ఉంటాయని నమ్ముతాము. క్యాన్సర్ కణితలు మన శరీరంలో పెరగకుండా నిరోధించడంలో సహాయపడే ఒక శక్తివంతమైన రసాయనం ఉత్పత్తిని పెంచడానికి మూడు సాధారణ కూరగాయలను ఉన్నాయి.

1 / 5
సాధారణంగా మనం కూరగాయలను కోసిన వెంటనే వండటం మంచిదని భావిస్తాము. అలా చేస్తే వాటిలోని పోషకాలు కోల్పోకుండా ఉంటాయని నమ్ముతాము. క్యాన్సర్ కణితలు మన శరీరంలో పెరగకుండా నిరోధించడంలో సహాయపడే ఒక శక్తివంతమైన రసాయనం ఉత్పత్తిని పెంచడానికి మూడు సాధారణ కూరగాయలను ఉన్నాయి. వీటిని వండే ముందు 45 నిమిషాల నుండి గంటసేపు పక్కన పెట్టాలని చెబుతున్నారు.

2 / 5
ఆ మూడు కూరగాయలు ఏమిటంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ. వీటిని మనం తరచుగా వినియోగిస్తుంటాం. ఈ కూరగాయలలో సల్ఫోరఫేన్ అనే ఒక ముఖ్యమైన రసాయనం ఉంటుందని, ఇది క్యాన్సర్ కణితల నివారణలో విశేషంగా సహాయపడుతుందని
అంటున్నారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ కణితలు పెరగకుండా రక్షించడానికి ఈ సల్ఫోరఫేన్ దోహదపడుతుంది.

ఆ మూడు కూరగాయలు ఏమిటంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ. వీటిని మనం తరచుగా వినియోగిస్తుంటాం. ఈ కూరగాయలలో సల్ఫోరఫేన్ అనే ఒక ముఖ్యమైన రసాయనం ఉంటుందని, ఇది క్యాన్సర్ కణితల నివారణలో విశేషంగా సహాయపడుతుందని అంటున్నారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ కణితలు పెరగకుండా రక్షించడానికి ఈ సల్ఫోరఫేన్ దోహదపడుతుంది.

3 / 5
సాధారణంగా కూరగాయలు కోసిన తర్వాత వాటిని నీళ్లలో వేయడం లేదా వెంటనే వండటం ఆక్సీకరణం జరగకుండా నిరోధించడానికి చేస్తారు. కానీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ విషయంలో ఈ ఆక్సీకరణ ప్రక్రియనే సల్ఫోరఫేన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కాబట్టి, వీటిని నీళ్లలో వేయకుండా, కేవలం కోసి బయట ఉంచితే చాలు.

4 / 5
అంతేకాకుండా, ఈ కూరగాయలను వండే పద్ధతి కూడా వాటి ప్రయోజనాలను ప్రభావితం చేస్తుంది. సల్ఫోరఫేన్ వంటి సున్నితమైన రసాయనాలు అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు వాటి ప్రభావం తగ్గుతుంది. కాలిఫ్లవర్ 65 వంటి నూనెలో డీప్ ఫ్రై చేసే వంటకాలు లేదా ఇతరత్రా ఎక్కువ వేపుడు చేసే పద్ధతులలో ఈ సల్ఫోరఫేన్ ప్రయోజనాలు పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది

5 / 5
ఇతర దేశాలలో బ్రోకలీ వేడి నీళ్లలో వేసి వెంటనే తీసేయడం, సలాడ్లలో పచ్చిగా తినడం వంటి పద్ధతులను పాటిస్తారు. కాబట్టి, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ వంటి కూరగాయలతో క్యాన్సర్ నివారణ ప్రయోజనాలను గరిష్టంగా పొందడానికి, వాటిని కోసిన తర్వాత 45 నిమిషాల నుండి గంటసేపు వేచి ఉండి, ఆపై తక్కువ నూనెతో వండి లేదా ఉడికించి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us