పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే మాత్రం..

Updated on: Sep 10, 2026 | 7:13 AM

పొద్దున్నే ఒక ఉడికించిన గుడ్డు తినడం వల్ల శరీరానికి శక్తి, మెదడుకు చురుకుదనం లభిస్తాయి. గుడ్డులోని ప్రోటీన్ కండరాల నిర్మాణం, మరమ్మతులకు సహాయపడుతుంది. అమైనో ఆసిడ్లు కణాలకు పోషణను అందిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది ఒక అద్భుతమైన ప్రోటీన్ మూలం. అయితే, మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి తగిన ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 6
గుడ్డులో ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు ఉంటాయి.. అందుకే.. ప్రతిరోజు ఒక గుడ్డును తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక మధ్యస్థాయి కోడిగుడ్డులో దాదాపు 70-80 కాలరీలు, 6 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్, శరీరానికి అవసరమైన అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

2 / 6
గుడ్డులో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి12 (రైబోఫ్లేవిన్, ఫోలేట్) పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఐరన్, జింక్, సెలీనియం, ఫాస్పరస్, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా.. నాడీ వ్యవస్థకు తోడ్పడే కోలిన్ తోపాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, కంటి ఆరోగ్యానికి మేలు చేసే లుటీన్, జియాక్సంతిన్ ఉంటాయి.

3 / 6
పొద్దున్నే లేవగానే ఒక ఉడికించిన గుడ్డు తినడం వల్ల మన శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు సంభవిస్తాయి. గుడ్డు కడుపులోకి వెళ్ళగానే జీర్ణక్రియ మొదలై, అందులోని ప్రోటీన్ చిన్న భాగాలుగా విడిపోతుంది. ఈ ప్రోటీన్ నుంచి విడుదలయ్యే అమైనో ఆసిడ్లు శరీర కణాలకు చేరి, కండరాల నిర్మాణం, వాటి మరమ్మతులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

4 / 6
గుడ్డులోని పోషకాలు కేవలం కండరాలకే కాకుండా, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా, మెదడు పనితీరుకు కూడా సహాయపడతాయి. తద్వారా రోజువారీ పనులలో మరింత చురుకుదనాన్ని, ఏకాగ్రతను పెంపొందించడంలో తోడ్పడతాయి. ఉడికించిన గుడ్డులో కొవ్వు తక్కువగా ఉండటం, ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఒక మంచి ప్రోటీన్ ఆహారంగా గుర్తింపు పొందింది.

5 / 6
అయితే, ఈ ప్రయోజనాలను పొందేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ సమాచారం కేవలం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కాబట్టి, మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి తగ్గ ఆహారాన్ని, ముఖ్యంగా ఆహార నియమాలను నిపుణుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.

6 / 6
అయితే.. గుడ్డు పెంకు మంచిగా వచ్చేందుకు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది.. గుడ్లు ఉడకబెట్టే సమయంలో నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా లేదా కొన్ని చుక్కల వెనిగర్ వేస్తే పెంకు ఈజీగా వస్తుందని చెబుతున్నారు. బేకింగ్ సోడా పొరను వదులు చేస్తుందని చెబుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us