
ఒంట్లో వేడి సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు, ఇంకా ఈ టైం లో కడుపును చల్లబరిచే ఆహారాలను తీసుకోవాలి. నిముషాల్లో బాడీని చల్లగా ఈ వడలు తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

బొబ్బర్ల వడలకు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల బొబ్బర్లు, చిన్న ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి , 10 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 10 కరివేపాకు ఆకులు, అర కట్ట కట్ చేసిన కొత్తిమీర, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ ఇంకా వీటిని వేయించడానికి ఆయిల్ ను కూడా తీసుకోవాలి.

బొబ్బర్ల వడల తయారీ విధానం : మీరు బొబ్బర్ల పిండిని తీసుకుని దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ , ఇంకా ఉప్పును కూడా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేస్తే బొబ్బర్ల వడలు ఎంతో రుచిగా ఉంటాయి.

బొబ్బర్ల వడల తయారీ విధానం: గ్యాస్ వెలిగించి ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ పిండిని తీసుకుని వడలుగా వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసి సన్నని మంటపై ఈ వడలను వేయించాలి. ఇవి ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా వీటిని కాల్చుకోవాలి. అంతే బొబ్బర్ల వడలు రెడీ. మామిడి చట్నీతో తింటే సూపర్ ఉంటుంది

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)