
శక్తివంతమైన ఈ పానీయం మీరు రోజూ తీసుకుంటే వయస్సు పై బడి నడవలేని వాళ్ళు కూడా పరుగులు పెడతారు. అయితే మీరు దీనిని ఉదయం ఖాళీ కడుపుతో కానీ రాత్రి భోజనం చేసిన తర్వాత గోరువెచ్చగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఆరోగ్యకరమైన దాల్చిన చెక్క పానీయానికి కావాల్సిన పదార్థాలు : రెండు గ్లాసులు నీరు, మూడు నల్ల యాలకులు, ఒక దాల్చిన చెక్క, 5 నుంచి 6 లవంగాలు, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంను తీసుకోవాలి. దీనిని మీరు సరైన కొలతలతో చేసి తాగితే అన్ని వేళలా ఆరోగ్యంగా ఉంటారు.

ఆరోగ్యకరమైన దాల్చిన చెక్క పానీయం తయారీ విధానం : ముందుగా ఒక పాత్రలో రెండు గ్లాసుల నీరు పోయాలి. ఆ తర్వాత దీనిలో నల్ల యాలకులను కూడా వేసి ఈ నీటిలో వేయాలి. ఇంకా దీనిలో దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు కూడా వేయాలి. ఇలా వేసిన తర్వాత మంటపై కనీసం 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి.

ఆరోగ్యకరమైన దాల్చిన చెక్క పానీయం తయారీ విధానం : అయితే మీరు దీనిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి మరిగిస్తే తాగడానికి రుచిగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టాలి. ఇక కొద్దీ సేపటి తర్వాత వడకట్టి వీటిని గోరువెచ్చగా తాగాలి. అయితే ఇంకా టేస్ట్ కావాలంటే తేనె కలుపుకుని దీనిని తాగొచ్చు

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)