Car Purchase: సేఫ్టీలో నంబర్ 1.. మైలేజ్‌లో తోపులు.. 5-స్టార్ రేటింగ్‌తో వచ్చే 4 బడ్జెట్ కార్లు ఇవే!

Updated on: Jun 29, 2026 | 7:54 PM

ఈ మధ్యకాలంలో చాలా మంది కస్టమర్స్‌ మైలేజ్ కంటే సేఫ్టీకే ఎక్కవ ప్రధాన్య ఇస్తున్నారు. కాబట్టి చాలా మంది మంచి సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్ల కోసం చూస్తున్నారు. ఒక వేళ మీరు కారు కొనాలని చూస్తుంటే.. మీ బడ్జెట్ రూ.10లక్షల వరకు ఉంటే.. గ్లోబల్ లెవల్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్ ఉన్న కొన్ని కార్ల గురించి చెప్పబోతున్నాం.. వాటిలో మీకు కావాల్సిన ఫీచర్స్‌ను బట్టి మీకు ఏది కావాలో ఇక్కడ ఎంచుకోండి.

1 / 5
టాటా నెక్సాన్ : సేఫ్టీ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు టాటా.. తక్కువ ధరతో పాటు ఎక్కవ సేఫ్టీ ఫీచర్స్ అందించడంలో టాటా ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇక మన బడ్జెట్‌లో టాటా నుంచి 5 స్టార్ రేటింగ్‌తో వచ్చే కారు ఏది అంటే.. టాటా నెక్సాన్.. సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కారు NCAP టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి బలమైన ఇంపాక్ట్‌నైనా తట్టుకునేలా దీని బాడీ స్ట్రక్చర్ చాలా బలంగా డిజైన్ చేయబడింది.

2 / 5
ఇక దీని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రోల్ ఓవర్ మిటిగేషన్ , ఐసోఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తాయి. ఇవి ప్రమాదం జరిగినప్పుడు మనను రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి.

3 / 5
టాటా పంచ్ ఈవీ : ఇక రూ.10లక్షల బడ్జెట్‌లో మనకు వచ్చే మరో సేఫ్టీ కారు.. టాటా పంచ్ ఈవీ.. మైక్రో ఎస్‌యూవీ డిజైన్‌తో వచ్చే ఈ ఎలక్ట్రిక్ కార్, NCAP టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించింది. టాటా సంస్థ ప్రత్యేకమైన 'acti.ev' ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించిన ఈ కారులో బ్యాటరీకి కూడా ప్రత్యేక రక్షణ లభిస్తుంది. ఇక ఈ ఈవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 4 డిస్క్ బ్రేక్‌లు, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

4 / 5
మారుతి సుజుకి డిజైర్: ఇక మన బడ్జెట్‌లో వచ్చే మరో సేఫ్టీ కారు మారుతి సుజూకీ డిజైర్.. మారుతి నుంచి ఇటీవలే లాంచ్ అయిన ఈ కారు గ్లోబల్ NCAP టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. దీని బాడీ స్ట్రక్చర్, ఎక్స్‌టీరియర్ డిజైన్ పాత మోడల్ కంటే చాలా బలంగా రూపొందించబడింది. ఇక దీని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ప్రయాణికుల రక్షణ కోసం దీని ఫ్రంట్ డిజైన్‌ను ప్రత్యేకంగా మార్చారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

5 / 5
టాటా ఆల్ట్రోజ్ : బడ్జెట్‌లో సేఫ్టీ ఫీచర్స్‌తో వచ్చే మరోకారు ఏదైనా ఉందంటే.. అదే టాటా ఆల్ట్రోజ్.. ఈ కారు భారతదేశంలో లభించే అత్యంత సరసమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి. అలాగే ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా పొందింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.30 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి పైన అన్నింటిని పరిశీలించి మీకు కంఫర్ట్‌గా ఉండే కారును ఎంచుకోండి.

Follow Us