చికెన్ మటన్‌ కంటే బెస్ట్.. ఇలా ఎండు చేపల పులుసు చేస్తే వావ్ అనాల్సిందే

Updated on: Oct 04, 2026 | 10:44 AM

సండే వచ్చిందంటే చాలా చాలా మంది చికెన్, మటన్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కానీ చికెన్ మటన్ కంటే ఇలా ఎండు చేపల పులుసు ప్రిపేర్ చేసుకొని తింటే రుచి అదిరిపోతుందంట. కాగా, ఇప్పుడు మనం చాలా రుచికరంగా ఎండు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం .

1 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ఎండు చేపలు100 గ్రాములు,  చింతపండు: ఒక పెద్ద నిమ్మకాయ సైజు,   నూనె 4 టేబుల్ స్పూన్లు,  మెంతులు 1/4 టీ స్పూన్,   జీలకర్ర 1/2 టీ స్పూన్,   ఆవాలు 1/2 టీ స్పూన్,  పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్,   వెల్లుల్లి రెబ్బలు  కరివేపాకు,   ఉల్లిపాయ, ఉప్పు,   పసుపు,  టమాటా,  కారం,   ధనియాల పొడి, నీళ్లు,  కొత్తిమీర

2 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే..  ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును తీసుకుని,  ఒక గిన్నెలో వేసుకోవాలి. చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి పది నిమిషాలు నానబెట్టాలి. తర్వాత సుమారు 100 గ్రాముల ఎండు చేపలని తీసుకొని వాటి తల, భాగాన్ని తుంచి, తోక చివరలను కూడా కట్ చేసి మధ్యభాగం తీసుకొని గోరు వెచ్చటి నీటిలో వీటిని శుభ్రం చేసుకోవాలి.

3 / 5
ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో  నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. పులుసు కూరలకు కొద్దిగా నూనె ఎక్కువగా పడుతుంది. నూనె కాగిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు వేయాలి. ఆవాలు చిటపటలాడి, మెంతులు ఎర్రగా వేగే వరకు వేయించాలి.

4 / 5
పోపు దినుసులు వేగిన తర్వాత, నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెమ్మలను కచ్చాపచ్చాగా దంచి వేయాలి. దీంట్లోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి వెల్లుల్లి కొద్దిగా వేగే వరకు వేయించాలి. వెల్లుల్లి వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి వేయించాలి.ఉల్లిపాయలు వేగిన తర్వాత మీడియం సైజు టమాటా ముక్కలు వేసి అవి కూడా మెత్తబడే వరకు వేగనివ్వాలి.

5 / 5
 టమాటా ముక్కలు వేగిన తర్వాత ఎండు చేపలను వేసి మంచిగా వేయించుకోవాలి.  తర్వాత చింత పండు రసం వేసి మంచిగా కలుపుకోవాలి. మరీ పలచగా కాకుండా కాస్త చిక్కగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత   మూడు టీ స్పూన్ల కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. పులుపుకు తగ్గట్టుగా కారం,  ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. పులుసు బాగా మరిగి, చిక్కబడిన తర్వాత అందులో కొత్తిమీ, కొంచెం పూదీనా వేయాలి. అంతే ఎండు చేపల కర్రీ రెడీ

Loading...
Unable to load recommendations.
Follow Us