Shaik Madar Saheb |
Mar 02, 2021 | 3:12 PM
Benefits of Laughing : పెద్దలు నవ్వడం ఒక కళగా పేర్కొంటారు. ఎంత నవ్వితే.. అంత మంచిదంటూ సలహాలిస్తారు. నవ్వడం వల్ల మరింత ఆకర్షణీయంగా.. చురుకుగా కనిపిస్తామని నిపుణులు తెలుపుతారు. నవ్వితే అన్ని లాభాలేనని.. నవ్వడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
ఎక్కువగా నవ్వడం వల్ల మనం ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు నవ్వలేను అన్నట్టు అయితే ఫేక్ స్మైల్ ఇచ్చినా అది ఒత్తిడిని తగ్గిస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
నవ్వడం వల్ల మూడ్ కూడా మారిపోతుందట.. నెగెటివ్ ఆలోచనులుంటే.. ఒక నవ్వు వల్ల మారిపోతుందని పేర్కొంటున్నారు.
ఎప్పుడైనా మనం నవ్వుతూ ఆనందంగా ఉంటే.. మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా నవ్వుతూనే ఉంటారు. కావున నవ్వడం మాత్రం మరిచిపోవద్దని పేర్కొంటున్నారు.
నవ్వడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని పేర్కొంటున్నారు. బీపీ తగ్గడంతోపాటు రిలాక్స్ కావొచ్చిని తెలుపుతున్నారు.