
అన్ని పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే పండ్లలో కివి పండు కూడా ఒకటి. అయితే, దీనిని నేరుగా తినడం కంటే జ్యూస్ రూపంలో తీసుకుంటే చాలా మంచిది.

జుట్టు పెరుగుదల : కివిలో ఉండే విటమిన్లు, పోషకాలు జుట్టును ఊడిపోకుండా కాపాడుతుంది. అయితే, ఈ జ్యూస్ ను ఉదయం తాగితే వారికీ మంచి ఫలితం ఉంటుంది. నిజం చెప్పాలంటే అమ్మాయిలకు ఇది బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవాలి.

కివి జ్యూస్ జుట్టును బలపరచి, ఒత్తుగా పెరిగేందుకు ఇది సహాయ పడుతుంది. ఇంకా దీనిలో విటమిన్ సి ఉంటుంది. అది ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది.కాబట్టి, దీనిని ఇప్పటి నుంచైనా మీ డైట్ లో చేర్చుకోండి.

చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది: కివీ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడమే కాకుండా ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి, మీరు రోజూ ఈ జ్యూస్ రెండు రోజులకొకసారి తాగండి.

జీర్ణ వ్యవస్థ : ఉదయంపూట జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు కివీ జ్యూస్ తీసుకుంటే జీర్ణ క్రియ పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే, దీనిలో ఉండే ఫైబర్ ఈ సమస్యలకు చెక్ పెడుతుంది.