ABC జ్యూస్ కాదు, BTB జ్యూస్‌తో రెట్టింపు లాభాలు.. ఆరోగ్యంతో పాటు మరింత అందం మీ సొంతం!

Updated on: Jul 07, 2025 | 5:34 PM

ABC జ్యూస్.. ప్రస్తుతం చాలా మంది చర్మ సంరక్షణలో భాగంగా ఈ జ్యూస్‌ తీసుకుంటున్నారు. ఆపిల్, బీట్‌రూట్‌, క్యారెట్ ఈ మూడింటినీ కలిపి ABC జ్యూస్ తయారు చేస్తారు. కానీ, ఇప్పుడు మరో కాంబినేషన్‌ ఏబీసీ జ్యూస్‌కి బదులు BTB జ్యూస్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ జ్యూస్‌తో మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ బీటీబీ జ్యూస్ అంటే ఏంటి అనుకుంటున్నారా..? బీట్‌రూట్‌, టమాట, బాటిల్ గార్డ్( సొరకాయ) ఈ మూూడు కలిపి తయారు చేసేది బీటీబీ జ్యూస్‌. ఇది రోజూ తాగితే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ లాభాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5
ఈ బీటీబీ జ్యూస్ తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది. చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుందని అంటున్నారు.. తరచూ ఈ జ్యూస్‌ తీసుకోవటం వల్ల ముఖాన్ని మెరిసేలా చేస్తుందని అంటున్నారు. ఈ జ్యూస్‌ను తయారు చేయడానికి ఒక బీట్‌రూట్, ఒక టమటా, అరకప్పు సొరకాయ ముక్కలు తీసుకోవాలి. వీటన్నింటిని బ్లెండర్ లో వేసి, అరకప్పు నీటితో కలిపి జ్యూస్‌ పట్టుకోవాలి. ఇందులోకి అర అంగుళం అల్లం ముక్క, ఒక టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు నల్ల ఉప్పు కలుపుకోవాలి.

2 / 5
ఒక అధ్యయనం ప్రకారం, బీట్‌రూట్ జ్యూస్‌ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో, హృదయనాళ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. టమోటా రసంలో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త నాళాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది పొటాషియంను కూడా అందిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

3 / 5
టమాటాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ సమయం కడుపు నిండినట్లుగా ఉంటుంది. తినాలనే కోరికలను తగ్గిస్తుంది. ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది. సొరకాయ రసంలో కూడా కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అతిగా తినకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

4 / 5
సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది హైడ్రేషన్‌ను ప్రోత్సహిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. టమాటాలు గట్ ఆరోగ్యానికి మద్దతునిస్తాయి. బీట్‌రూట్‌లో ఫైబర్ , సహజ నైట్రేట్లు , బీటైన్ పుష్కలంగా ఉండి, జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించడంలో, ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

5 / 5
టమాటా రసం యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ముఖ్యంగా లైకోపీన్, విటమిన్ సి, ఇవి మీ చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా కాపాడతాయి. మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మానికి సహజ అందాన్ని కూడా తెస్తుంది. బీట్‌రూట్ జ్యూస్‌ చర్మానికి రక్త ప్రసరణ,  మైక్రోవాస్కులర్ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.