
రక్తహీనత: అమ్మాయిల్లో రక్తం తక్కువగా ఉన్నవారు బీట్‌రూట్ తీసుకుంటే చాలా మంచిది. దీనిలో ఐరన్ అధికంగా ఉంటుంది. అమ్మాయిల్లో సర్వసాధారణమైన రక్తహీనత సమస్యను ఇది చెక్ పెడుతుంది.

నెలసరి సమస్యలు: నెలసరి సమయాల్లో కొందరు అమ్మాయిలు నీరసించిపోతారు. అలాంటి వారు ఆ సమయంలో ఈ జ్యూస్ తాగితే రక్తం పట్టడమే కాకుండా హార్మోన్ల సమతుల్యతకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది.

కాంతివంతమైన చర్మం: బీట్‌రూట్ జ్యూస్ తాగితే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే, మచ్చలు కూడా తగ్గిపోయి ముఖం మంచిగా అవుతుంది

ఇమ్యూనిటీ పవర్ శక్తి : ఇది శరీరానికి అధిక శక్తిని ఇస్తుంది. రోగ నిరోధక శక్తీ తక్కువగా ఉన్నవారు, నీరసంగా ఉన్నవారు దీనిని జ్యూస్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జీర్ణక్రియ: బీట్‌రూట్ లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పని తీరును ఇది మెరుగుపరుస్తుంది.(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)