జిమ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాల్సింటే.. దీన్ని మించిన ప్రీ వర్కౌట్ లేదు..

Updated on: Oct 02, 2026 | 11:07 PM

ఈ రోజుల్లో ఫిట్‌గా కనిపించాలని చాలా మంది జిమ్‌కు వెళ్తూ.. డైట్స్‌ ఫాలో అవుతున్నారు. ఈ డైట్లో పండ్లు, కూరగాయలు రకరకాల వాటిని తీసుకుంటూ ఉంటారు. కానీ మన శరీరానికి తక్షణ శక్తిని అందించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే బీట్‌రూట్‌ను మాత్రం పెద్దగా పట్టించుకోరూ.. అవును రోజూ బీట్‌రూట్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వం మెరుగుపడటమే కాకుండా, శరీర సమగ్ర ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బీట్‌రూట్‌ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
ఇందులో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీట్‌రూట్‌లో ఫోలేట్, పొటాషియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంతో కీలక పాత్ర పోషిస్తాయి. రోజూ ఆహారంలో బీట్‌రూట్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన తక్షణ శక్తి, విటమిన్లు సులభంగా అందుతాయి.

2 / 5
జిమ్‌కు వెళ్తూ.. వర్కౌట్స్‌ చేసే వారికి ఇది బెస్ట్ ఎనర్జీ బూస్టర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఉండే సహజ నైట్రేట్లు కండరాలకు రక్తప్రసరణను, ఆక్సిజన్ సరఫరాను గణనీయంగా మెరుగుపరుస్తాయి. కఠినమైన వ్యాయామాలు చేసేటప్పుడు అలసిపోకుండా ఎక్కువ సమయం స్టామినాను నిలబెట్టుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అందుకే వర్కవుట్‌కు ముందు బీట్‌రూట్ జ్యూస్ తాగడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.

3 / 5
బీట్‌రూట్‌లో ఫైటోన్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. వీటికి శరీరంలో వాపులు, మంటలను తగ్గించే ప్రత్యేక శక్తి ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. రోజూ బీట్‌రూట్ తీసుకోవడం వల్ల శరీరంలోని అంతర్గత మంట సహజంగానే తగ్గిస్తుంది. అలాగే ఒళ్లు నొప్పులు, ఇతర శారీరక అసౌకర్యాల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

4 / 5
అంతేకాదు బీట్‌రూట్‌ బీపీని కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇందులోని సహజ నైట్రేట్లు రక్తనాళాలు విచ్చుకునేలా చేసి, శరీరమంతటా రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు దోహదపడతాయి. ఇది అధిక రక్తపోటును సమర్థవంతంగా తగ్గించి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.

5 / 5
బీట్‌రూట్‌లో లివర్ పనితీరును మెరుగుపరిచే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యాన్ని రక్షించి.. శరీరంలో పేరుకుపోయే ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి, లివర్ సాధారణంగా, చురుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. తద్వారా కాలేయ వ్యాధులు రాకుండా చాలావరకు అడ్డుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us