
గుమ్మడికాయ: వేసవిలో సర్వసాధారణంగా తినే కూరగాయలలో గుమ్మడికాయ ఒకటి. దీనిలోని ఉండే అధిక నీటి శాతం శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే హైడ్రెడ్‌గా ఉంచుతుంది. గుమ్మడికాయను కూరలు లేదా సూప్‌గా సులభంగా మన ఆహారంలో చేర్చుకోవచ్చు.ఇది తేలికగా ఉండటం వల్ల, సులభంగా జీర్ణమవుతుంది.

దోసకాయ: సమ్మర్‌లో ఎక్కవ మంది తినేందుకు ఇష్టపడే ఆహారాల్లో దోసకాయ అత్యంత ప్రజాదరణ పొందిన కూరగాయ. ఇది శరీరాన్ని తేమగా ఉంచడంలో, హైడ్రెడ్‌గా ఉంచడంతో ఎంతగానో సహాయపడుతుంది. దీనిని సలాడ్, రైతా లేదా తేలికపాటి చిరుతిండిగా తీసుకోవచ్చు. దోసకాయలో ఉప్పు, నిమ్మరసం కలపడం వల్ల దాని రుచి మరింత పెరుగుతుంది. దీన్ని జ్యూస్‌లా కూడా తాగవచ్చు.

కాకరకాయ: వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో కాకరకాయ కూడా ఒకటి. ఇవి రుచిలో కాస్త చేదుగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి చాలా మేలైనదిగా పరిగణించబడుతుంది. వేసవిలో దీనిని క్రమం తప్పకుండా తినాలని వైద్యులు కూడా సిఫార్సు చేస్తారు. దీనికి ఉల్లిపాయలు, మసాలాలు జోడించి ఇంట్లోనే కర్రీ చేసుకొని అన్నం లేదా రొట్టెలకు తింటే టేస్ట్ అదిరిపోతుంది అంతే.

పాలకూర: వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో పాలకూరలో టాప్‌లో ఉంటుంది. ఇందులో అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. దీనిని పప్పుగా, కూరగా లేదా గ్రేవీగా అనేక రకాలుగా మన ఆహారంలో చేర్చుకోవచ్చు. వేసవిలో, దీనిని ఎక్కువ సేపు ఉడికించడం కంటే తేలికగా వండటం మంచిది. ఎందుకంటే ఎక్కవ సేపు ఉండికిస్తే దీనిలోని నీటిశాతం తగ్గిపోతుంది.

టిండా: ఇది చూడటానికి చిన్న ఆపిల్ పరిమాణంలో, ఆకుపచ్చ రంగులో ఉండే ఒక రకమైన సొరకాయ జాతికి చెందిన కూరగాయ. దీన్ని ఎక్కువగా నార్త్ ఇండియాలో తింటారు. ఇది ఒక ప్రసిద్ధ వేసవి కూరగాయ. వేసవి కాలంలో తేలికపాటి, పోషకమైన భోజనానికి ఇది ఒక మంచి ఎంపిక. దీన్ని ఉల్లిపాయ, టామాటో కలిపి కూర చేసి తింటే టాస్ట్ అదిరిపోతుంది.