
Beans 1

గ్రీన్ బీన్స్‌లో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల గ్రీన్ బీన్స్‌లో దాదాపు 14 మైక్రోగ్రాముల విటమిన్ కె లభిస్తుంది. ఈ విటమిన్ కె తో పాటు, బీన్స్‌లో ఉండే కొన్ని ప్రత్యేక రసాయన సమ్మేళనాలు మనం తీసుకున్న ఆహారంలోని కాల్షియంను ఎముకలు సమర్థవంతంగా గ్రహించేలా చేస్తాయి. ఇంకా కాల్షియం నేరుగా శరీరంలోకి వెళ్లినంత మాత్రాన సరిపోదు, అది ఎముకలకు పట్టి గట్టిపడటం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియలో గ్రీన్ బీన్స్ కీలక పాత్ర పోషిస్తాయి.

ఎముకల బలానికి గ్రీన్ బీన్స్ ఎలా దోహదపడతాయో ఇక్కడ తెలుసుకుందాం. గ్రీన్ బీన్స్ "ఆస్టియోక్యాల్సిన్" అనే ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఆస్టియోక్యాల్సిన్ ఎముక కణజాలాన్ని ఆరోగ్యంగా.. దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఈ ఎముకలు గట్టిగా, పటిష్టంగా తయారవుతాయి. కాబట్టి, ఎముకలు దృఢంగా ఉండటానికి ఈ ఆస్టియోక్యాల్సిన్ ఉత్పత్తిని పెంచడంలో గ్రీన్ బీన్స్ చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.

కొంతమందికి మామూలు చిక్కుడుకాయలు అరగవని, గ్యాస్ లేదా కడుపు బరువుగా అనిపించే సమస్యలుంటాయి. వాటిలో ఒలిగోశాకరైడ్స్ ఎక్కువగా ఉండటం దీనికి కారణం. అయితే, గ్రీన్ బీన్స్‌లో అలాంటి సమస్యలు ఉండవు. ఇవి తేలికగా ఉంటాయి, సులభంగా జీర్ణమవుతాయి. ఏ రూపంలో వండినా ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించవు. ఈ బీన్స్ లోని గింజలు కూడా మెత్తగా ఉంటాయి. కాబట్టి, ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ బీన్స్‌ను రెగ్యులర్ గా వాడుకోగలిగితే చాలా మంచిది. మీరు ఏ రకమైన ఫ్రైలు చేస్తున్నా, కొన్ని గ్రీన్ బీన్స్‌ను కట్ చేసి అందులో కలుపుకోవచ్చు. ఫ్రైడ్ రైస్‌లలో వేసినట్లుగానే, రోజూ మనం వండుకునే కూరల్లో కూడా బీన్స్ ముక్కలు వేసి వండవచ్చు. పిల్లలకు ఇటువంటి పౌష్టికాహారాన్ని అలవాటు చేయడం చాలా మంచిది.

గ్రీన్ బీన్స్ ఏడాది పొడవునా లభిస్తాయి కాబట్టి, వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. నాన్‌స్టిక్ పాత్రలో కొద్దిగా మీగడ లేదా తక్కువ నూనెతో గ్రీన్ బీన్స్ ఫ్రై చేసుకుని, నువ్వుల పొడి, కొబ్బరి తురుము చల్లుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది సులభంగా, ఉప్పు లోటు లేకుండా తినడానికి అనువుగా ఉంటుంది. గ్రీన్ బీన్స్ లోని పచ్చిదనం పోవాలంటే, వాటిని పది నిమిషాల పాటు పుల్లటి పెరుగు లేదా నిమ్మరసం కలిపిన నీటిలో ఉడికించి, ఆపై వేయించుకోవచ్చు. ఈ పులుపు బీన్స్ లోని చప్పదనాన్ని పోగొట్టి, మంచి రుచిని ఇస్తుంది. ఈ రకమైన వంట పద్ధతుల పోషకాలు కోల్పోకుండా, గ్రీన్ బీన్స్ యొక్క పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.