Bathroom Cleaning Tips: మీ బాత్రూం నుంచి దుర్వాసన వస్తుందా? ఈ సింపుల్‌ ట్రిక్‌తో సువాసనలు నింపండి

|

Sep 06, 2024 | 9:03 PM

ఇల్లు ఎంత అందంగా అలంకరించినా, బాత్రూంలో ఖరీదైన కుళాయిని అమర్చినా.. ఒక్కోసారి బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఎంత బాగా క్లీన్ చేసినా ఈ వాసన వస్తూనే ఉంటుంది? దీంతో ఏం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడిపోతుంటారు. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత సరిగ్గా శుభ్రం చేయకపోతే సాధారణంగా దుర్వాసన వస్తుంది..

1 / 5
ఇల్లు ఎంత అందంగా అలంకరించినా, బాత్రూంలో ఖరీదైన కుళాయిని అమర్చినా.. ఒక్కోసారి బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఎంత బాగా క్లీన్ చేసినా ఈ వాసన వస్తూనే ఉంటుంది? దీంతో ఏం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడిపోతుంటారు. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత సరిగ్గా శుభ్రం చేయకపోతే సాధారణంగా దుర్వాసన వస్తుంది. మూత్ర విసర్జన చేసిన తర్వాత బాత్రూమ్ సరిగ్గా ఫ్లష్ చేయకపోయినా, దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది.

2 / 5
బాత్రూంలో వెంటిలేషన్ లేకపోతే దుర్వాసన వస్తుంది. కాబట్టి బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. బాత్‌రూమ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోకపోతే దుర్వాసన వస్తుంది. బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత, దానిని నీటితో శుభ్రం చేసి, బాత్రూమ్ కిటికీలు, తలుపులు తెరచి ఉంచుకోవాలి. వెలుతురు, గాలిని లోపలికి వెళ్లి, చెడు వాసనను తొలగిస్తుంది.

3 / 5
బాత్రూమ్ లోపల బేసిన్ ఉంటే, దానిని కూడా శుభ్రంగా ఉంచాలి. చాలా సార్లు, బేసిన్‌లో వెంట్రుకలు, ధూళి పేరుకుపోయినా దుర్వాసన వస్తుంది. కాబట్టి ఇవి లేకుండా చూసుకోవాలి.

4 / 5
బాత్రూంలో సువాసన కోసం ఇతర పదార్ధాలు వేలాడదీయవచ్చు. చాలా మంది ఇళ్లలో ఇలాగే చేస్తుంటారు. అలాగే ఒక గిన్నెలో కొంచెం బేకింగ్ సోడా వేసి, బాత్రూంలో ఓ మూలన ఉంచితే చెడు వాసన పోతుంది. నిమ్మరసంతో వెనిగర్ కలిపి, అందులో కొంచెం నీళ్లుపోసి, స్ప్రే బాటిల్‌లో పోయాలి. ఈ మిశ్రమాన్ని బాత్రూంలో అప్పుడప్పుడు స్ప్రే చేసుకోవాలి. ఈ ట్రిక్ బాత్రూమ్ నుండి చెడు వాసనను కూడా తొలగిస్తుంది.

5 / 5
ఒక గిన్నెలో కొన్ని చుక్కలు ఎసెన్షియల్‌ నూనె తీసుకుని, బాత్రూంలో ఉంచాలి. ఎసెన్షియల్‌ నూనెల సువాసన మనస్సును ఆహ్లాదంగా ఉంచడంతోపాటు, చెడు వాసన పోతుంది.