
ఇవి అలాంటి.. ఇలాంటి బజ్జీలు కావు. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటాయి. నీరసంతో బాధ పడేవాళ్లు వీటిని వారంలో రెండు సార్లు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మరి అస్సలు ఆలస్యం లేకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.

అరటి బజ్జీలకు కావాల్సిన పదార్థాలు: మూడు పచ్చి అరటిపండ్లు, కప్పున్నర శనగపిండి, మూడు టీ స్పూన్స్ బియ్యప్పిండి, ఒక టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు , అర టీ స్పూన్ వాము , ఇంకా కొంచం కొద్దిగా పసుపు, అర టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, దీనిలో సరిపోను నీరు ఇంకా వేయించడానికి ఆయిల్ ను తీసుకోవాలి.

అరటి బజ్జీలు తయారీ విధానం: ముందుగా అరటిపండ్లను తీసుకుని పై తొక్కను తీసి వాటిని నిలువగా లేక అడ్డంగా అయినా ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక మీడియం సైజ్ గిన్నెను తీసుకుని కొంచం శనగపిండి, కొంచం బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, ఇంకా పసుపు, కొద్దిగా వాము, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీనిలో కలపాలి. ఇంకా నీటిని పోస్తూ ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి.

అరటి బజ్జీలు తయారీ విధానం స్టెప్ 2 : ఈ పిండిని మీరు తీసుకుని కనీసం 15 నిమిషాలు పాటు దీనిని పక్కన పెట్టాలి. అలాగే, మసాలా కూడా మంచిగా పడుతుంది. ఇక ఇప్పుడు పాన్ లో కొంచం నూనె పోసి మీడియం మంటపై దీనిని వేడి చేయాలి. ఇది వేడయ్యాక ఈ అరటి ముక్కలను తీసుకుని ఒక్కొక్కటిగా వేయాలి.

అరటి బజ్జీలు తయారీ విధానం స్టెప్ 3 : ఇప్పుడు నూనెలో ఈ బజ్జీలు వేసాక ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా బంగారు కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించాలి. ఈ బజ్జీలు కర కర లాడాలంటే ఆయిల్ లో కొంతసేపు ఉంచాలి. ఇవి బాగా కాలిన తరవాత తీసి టిష్యూపై 5 నిముషాలు ఉంచి ఆ తరవాత తినాలి.