
ఈ క్రమంలోనే ఆమె 2027కు సంబంధించి కూడా భవిష్యవాణి తెలియజేసింది. ముఖ్యంగా జ్యోతిష్యం ప్రకారం 2027లో నాలుగు రాశుల వారికి అద్భతంగా ఉండనున్నదని, వారికి ఈ సంవత్సరం రాజయోగం కలగనుందని తెలియజేయడం జరిగింది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కుంభ రాశి : కుంభ రాశి వారికి 2027 అంటేనే అదృష్టం. బాబా వంగా చెప్పిన ప్రకారం ఈ రాశి వారికి ఊహించని ధన లాభం కలుగుతుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి అవకాశం వస్తుంది. కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గి, ప్రశాంతత వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ పేరు, మీ మాటకు అందరూ విలువ ఇస్తారు.

వృషభ రాశి : వృషభ రాశి వారికి 2027 సంవత్సరం ఒక గొప్ప మలుపు లాంటిది. ఇప్పటివరకు ఎంత కష్టపడినా ఫలితం రాలేదు అనుకున్న వారికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది. ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగంలో పెద్ద పదవి, వ్యాపారంలో భారీ లాభం వస్తుంది. ఇంట్లో సంతోషం, సమాజంలో గౌరవం పెరుగుతుంది. చాలా రోజులుగా అనుకుంటున్న సొంత ఇల్లు, సొంత వాహనం కొనే కల ఈ ఏడాది నెరవేరుతుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి 2027 లో నిజమైన రాజయోగం ఉంది. సింహం అంటేనే రాజు, ఈ ఏడాది ఆ రాజసం మీ జీవితంలో కనిపిస్తుంది. ఉద్యోగంలో మీరు కోరుకున్న స్థానానికి చేరుతారు. పెద్దవాళ్ళ ఆశీర్వాదం, అధికారుల మద్దతు మీకు లభిస్తుంది. ధనం, ఆస్తి విషయంలో మంచి లాభం వస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది.

తుల రాశి : తుల రాశి వారికి 2027 సంవత్సరం బంగారు సంవత్సరం అని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఉన్న అప్పులు, కష్టాలన్నీ తీరిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ప్రేమ, పెళ్లి విషయంలో శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారం చేసేవారికి డబుల్ లాభం వస్తుంది. మీరు చాలా కాలంగా కలలు కన్న వాహనం కొనడానికి ఇదే సరైన సమయం. ఇంటా బయట మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది.టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.