Health Tips: ఈ 5 ఫుడ్స్ తింటే అన్నీ మర్చిపోతారట.. తెలుసుకోకపోతే ఆ సమస్యలు తప్పవు..

Updated on: Sep 10, 2025 | 11:48 AM

శారీరక శ్రమ ఎంత ముఖ్యమో.. మెదడు ఆరోగ్యానికి సరైన ఆహారం కూడా అంతే ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు మెదడు పనితీరును దెబ్బతీసి, జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం నిద్ర సమస్యలకు, ఒత్తిడికి కూడా దారితీయవచ్చు. మీ రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

1 / 5
ట్యూనా ఫిష్: ట్యూనాలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ అధికంగా తీసుకుంటే మెదడు పనితీరును తగ్గిస్తుంది. ట్యూనాలో పాదరసం అధికంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. ట్యూనాకు బదులుగా సాల్మన్ వంటి ఇతర చేపలను తీసుకోవడం మంచిది.

2 / 5
నారింజ రసం : ప్యాకేజ్డ్ నారింజ రసాలలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది చెడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అంతేకాకుండా అధిక చక్కెర వల్ల జ్ఞాపకశక్తి,  పని చేసే సామర్థ్యాలు తగ్గుతాయి.

3 / 5
సోయా : సోయాలో ఉప్పు, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి మెదడుకు హానికరమైనవి. అధిక సోడియం రక్తపోటును పెంచి మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు ఏర్పడవచ్చు.

4 / 5
అందుకే ఖాళీ కడుపుతో మద్యం తాగడం శరీరానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో మద్యం తాగే అలవాటు ఉన్నవారికి దీనితోపాటు భవిష్యత్తులో అనేక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. మద్యం తాగడం ప్రాథమికంగా ఆరోగ్యానికి హానికరం. అందులోనూ దానిని ఖాళీ కడుపుతో తాగడం మరింత డేంజర్‌.

5 / 5
తెల్ల బియ్యం : తెల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మానసిక పనితీరులో సమస్యలను సృష్టించి, నిరాశకు గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. ఈ 5 ఆహారాలను తగ్గించడం లేదా పూర్తిగా మానుకోవడం ద్వారా మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.