Avocado for Women: బటర్‌ ఫ్రూట్‌తో భలే లాభాలు.. రోజుకొక్కటి తీసుకుంటే డాక్టర్‌తో పనే ఉండదిక!

Updated on: Aug 12, 2025 | 7:28 PM

అత్యధికంగా ప్రోటీన్లు అందించే అవకాడో పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బటర్‌ ఫ్రూట్‌గా పిలిచే ఇందులో ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే ఈ అవకాడో మహిళల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ పండు చాలా అవసరం..

1 / 5
అయితే అవకాడోలో ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికీ అందరికీ సమానంగా మేలు చేయదు. అవును.. కొందరికి ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

2 / 5
అవకాడోలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి చాలా అవసరం. ఇది పీరియడ్స్‌ను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. మహిళలకు అవకాడో వల్ల కలిగే ప్రయోజనాలు నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..

3 / 5
ఇది దాదాపు చక్కెర రహితం. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే డయాబెటిక్ రోగులకు ఇది సూపర్ ఫుడ్. ఇందులోని ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధిక సమయం కడుపు నిండుగా ఉంచుతాయి. దీంతో ఆకలిని తగ్గిచి, కేలరీల నియంత్రణను సులభతరం చేస్తుంది. అవకాడోను ఎవరు తినకూడదు.

4 / 5
Avocado

Avocado

5 / 5
అవకాడోలో కొవ్వు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, దానిలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. కిడ్నీ రోగులు దీనిని మితంగా తినాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మూత్రపిండాల సమస్యలు ఉంటే ఇందులోని అదనపు పొటాషియం శరీరానికి హానికరం కావచ్చు. లాటెక్స్ అలెర్జీలు ఉన్నవారు వీలైతే దానిని నివారించాలి. అలాగే కాలేయ సమస్యలకు కూడా ఇది అంత మంచిది కాదు.