
అరటి కాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. పచ్చి అరటి కాయలు రెండు, నూనె, 3 టేబుల్ స్పూన్స్, పచ్చి శనగపప్పు, మినపప్పు వన్ టీ స్పూన్, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి రెండు, కరివేపాకు, పసుపు ఉప్పు రుచికి సరిపడ. కారప్పొడి కోసం, ఎండు మిరపకాయలు ఐదు నుంచి ఆరు. ఎండు కొబ్బరి పొడి వన్ టీ స్పూన్, ధనియాలు వన్ టీ స్పూన్, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి రెమ్మలు, ఉప్పు

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా, అరటికాయలకు చివర్లు కట్ చేసి, పైన ఉన్న తొక్కను సన్నగా తీసివేయాలి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని, అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మజ్జిగ కలపాలి. అరటికాయలను మరీ చిన్న ముక్కలుగా కాకుండా, కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మజ్జిగ కలిపిన నీటిలో వేయడం వలన అవి నల్లగా అవకుండా ఉంటాయి.

తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో నూనె పోసి, వేడి చేయాలి. తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, తుంచుకున్న ఎండుమిర్చి వేసి వేగనివ్వండి. పోపు వేగిన తర్వాత, మజ్జిగ నీళ్లలోంచి అరటికాయ ముక్కలను తీసి బాండీలో వేయండి. మంటను తక్కువ చేసి, ముక్కలు అంటుకోకుండా నెమ్మదిగా కలుపుతూ రెండు నిమిషాలు వేయించాలి. రెండు నిమిషాల తర్వాత, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి, తక్కువ మంటపై నిదానంగా వేయించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి

ఇప్పుడు కారప్పొడి తయారు చేసుకోవాలి. దీని కోసం మిక్సీజార్ తీసుకొని, అందులో ఎండు మిరపకాయలు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తటి పొడి కాకుండా, కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. నువ్వులు వేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఇక అరటి ముక్కలు మరో వైపు వేగుతూనే ఉంటాయి. అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారప్పొడి కూడా వేసుకోవాలి.

తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే వేడి వేడి అరటి కాయ వేపుడు రెడీ. మరి మీరు కూడా మీ ఇంటిలో ప్రిపేర్ చేసుకోండి. ఇది అన్నంలోకి తిన్నా నార్మల్‌గా తిన్నా రుచి చాలా అద్భుతంగా ఉంటుంది