ప్రతి రోజూ ఉదయాన్నే యాపిల్ జ్యూస్ తాగితే.. శరీరంలో జరిగే అద్భుతాలు తెలిస్తే…

Updated on: Jul 19, 2025 | 9:45 PM

రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌తో పనిలేదని తరచూ పెద్దలు చెబుతుంటారు. వైద్యులు సైతం రోజుకో యాపిల్‌ తినమని సిఫార్సు చేస్తుంటారు. యాపిల్‌ పండు మాత్రమే కాదు.. యాపిల్ జ్యూస్‌ కూడా అంతే ప్రయోజనకరంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉద‌యాన్నే యాపిల్ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల ఊహించిన లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. యాపిల్ జ్యూస్‌ తాగటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
యాపిల్‌ పండ్లలో విటమిన్‌ సి అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు యాపిల్‌ జ్యూస్‌ తీసుకోవడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జలుబు, ఫ్లూ వంటి చిన్న చిన్న సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.

2 / 5
యాపిల్ జ్యూస్‌ను రోజూ సేవిస్తుంటే చ‌ర్మం సైతం ఆరోగ్యంగా ఉంటుంది. చ‌ర్మ కాంతి పెరిగి మృదువుగా మారుతుంది. ముఖంపై ఉండే ముడ‌త‌లు, మ‌చ్చ‌లు పోతాయి. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. అలాగే యాపిల్ జ్యూస్‌ను తాగితే జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

3 / 5
అధిక బ‌రువుతో ఇబ్బంది పడుతున్నవారు రోజూ యాపిల్ జ్యూస్‌ను తాగితే మంచిది. దీని వ‌ల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావ‌న‌లో ఉంటారు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఫ‌లితంగా ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు సైతం రోజూ యాపిల్ జ్యూస్‌ను సేవిస్తుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది.

4 / 5
యాపిల్ జ్యూస్‌లో ఉండే స‌మ్మేళ‌నాలు ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. యాపిల్ జ్యూస్‌ను రోజూ సేవించ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వాపులు, నొప్పులు సైతం త‌గ్గిపోతాయి. దీంతో ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

5 / 5
యాపిల్ జ్యూస్‌ను రోజూ తాగుతుంటే జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఈ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయ‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. క‌నుక యాపిల్ జ్యూస్‌ను రోజూ ఉద‌యం తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంది.