
ఆధునిక కాలంలో యాంటీ ఏజింగ్, యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. అయితే, మార్కెట్లో లభించే రెడీమేడ్ ఉత్పత్తులు ఖరీదైనవి, తక్కువ ప్రయోజనకరమైనవని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఆహారాలే నిజమైన యాంటీ ఏజింగ్, యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉన్నాయని అంటున్నారు.

ప్రతి ఆకు, పండు, కూరగాయ, గింజ, దుంప, వేరు వంటి వాటిలో ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ వంటి ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, మనం ఆహారాన్ని పాలిష్ చేయడం, వండటం, వేపడం, దేవి తినటం, నిల్వ ఉంచడం వంటి ఐదు తప్పుల వల్ల ఈ పోషకాలు నశించిపోతున్నాయి. జంతువులు ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నాయి.

ఆహారంలో ఉండే ఔషధ గుణాలు వండినప్పుడు ఆవిరి రూపంలో, నిల్వ ఉంచినప్పుడు, మళ్ళీ వేడి చేసినప్పుడు నశించిపోతాయి. నూనెలో వేపడం వలన హానికరమైన ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి. పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి మసాలాలను కూడా పూర్వం వంట చివరిలో కలిపి వాటి గుణాలను కాపాడేవారు. కానీ, ఇప్పుడు నూనెలో వేపుతున్నారు. దీని వలన వయసు రాకుండానే కణాల వయసు పెరిగి, మనుషులు త్వరగా ముసలితనానికి గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

నేటి సమాజంలో యాంటీ ఏజింగ్ డ్రింక్స్, రెడీమేడ్ ఫుడ్స్ పేరుతో విక్రయించే ఉత్పత్తుల పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నప్పటికీ, అవి ఖరీదైనవి , తక్కువ ప్రయోజనకరమైనవిగా ఆయన చెబుతున్నారు. దీనికి విరుద్ధంగా, ప్రకృతి ప్రసాదించిన సహజ ఆహారాలలోనే నిజమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయని, అవి ఎలాంటి మోసం లేకుండా మనకు ప్రత్యక్ష ప్రయోజనాలను అందిస్తాయని అంటున్నారు.

ప్రకృతి సిద్ధమైన ప్రతి ఆహార పదార్థంలోను.. అది ఆకు అయినా, పండు అయినా, కూరగాయ అయినా, గింజ అయినా, దుంప అయినా, వేరు అయినా, బెరడు అయినా.. రోగాలను నివారించే శక్తిమంతమైన గుణాలు ఉన్నాయని అంటున్నారు. వీటిని ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అని పిలుస్తారు. టానిన్స్, టర్పినాయిడ్స్, క్వినోలిక్ కాంపౌండ్స్ వంటి రకరకాల రసాయన సమ్మేళనాలు శరీరంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్, యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటాయి.