
జ్యోతిష్య శాస్త్రంలో అన్ని యోగాల్లో అంగారక యోగం ప్రత్యేమైనది. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు కుంభ రాశిలోనే ఉండనున్నాడు. కుజుడు రాహువు కలిసి ఉన్న కాలాన్ని అంగారక యోగంగా చెబుతారు. ఈ సమయం అంత మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మూడు రాశులకు బ్యాడ్ టైం నడవనుందని తెలుస్తుంది.

అయితే, ఈ సమయంలో మేషం, వృషభ , కుంభ రాశి వారు జాగ్రత్త ఉండకపోతే చాలా సమస్యలు వస్తాయని అంటున్నారు. గొడవలకు అసలు వెళ్ళకండి. చిన్న గొడవలు కూడా భార్య భర్తలను విడదీసే వరకు వరకు వెళ్తాయి.

మేష రాశి : ఈ రాశి వారు కొత్త పనులు మొదలు పెట్టకపోవడమే మంచిది. మీ వైవాహిక జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి. భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి వలన వలన గొడవలు జరుగుతాయి. ఉద్యోగం మారేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి.

కుంభ రాశి : కుజుడు, రాహువు వల్ల కుంభ రాశి వారు కొన్ని విషయాల్లో చిక్కుకుపోతారు. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయాల్లో ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. మీ భార్యతో గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ ఇద్దరికీ గొడవలు జరిగితే అది విడిపోయే వరకు వెళ్తుంది.

వృషభ రాశి: ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు మీ ఇంట్లో వారిని సంప్రదించి తీసుకోండి. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టకపోవడమే మంచిది. వివాహం విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది.